The black beauty -1
రోజువారీ భండారాలు: 01/03/2012
ఫోటోగ్రఫీ : Images – 2012 (6)
ఇంతకు ముందు ఫోటోకు కొనసాగింపు దశ ఈ ఫోటో. గాలి బాగా వీచి balance లేకుండా చేస్తున్నా, పట్టువదలని విక్రమార్కుని చెల్లెలులాగా, పూవును మాత్రం వదిలి వెళ్ళలేదు ఈ సీతకోక చిలుక!. గాలి ఉధృతం కాస్త తగ్గగానే మధుపానానికి సమాయత్తమయింది. నిజానికి ఓమోస్తరు గాలి ఇంకా వీస్తూనే ఉంది. పూవు రెక్కల వంపులోనూ, వీస్తున్న గాలి బలానికి కుడివైపుకు తోయబడినట్లున్న సీతాకోకచిలుక posture వంపులోనూ అది కనిపిస్తుంది.
ఫోటోమీద ఎక్కడైనా సరే click చేసి, High Definition లో image ని చూడండి. అంత గాలిలోనూ, అంత imbalance లోనూ పూవులోని మధువును తాగేందుకు సీతాకోకచిలుక ముఖానికి వుండే స్ట్రా లాంటి భాగం….ఆ భాగాన్ని ఏమంటారో నాకు తెలియదు…దానిని పూవులోనికి వయ్యారంగా దించడం స్పష్టంగా కనిపిస్తుంది.
