ఈ సీతాకోకచిలుకకి పూవులన్నా, ఆకులన్నా ఎలర్జీ అనుకుంటాను, ఎప్పుడుచూసినా ఇది foot path మీదనే దర్శనమిస్తుంది నాకు! మీదకి తోసుకొచ్చి మరీ ఫోటోలు తీయమన్నట్లుగా పోజిచ్చి కూర్చుంటుంది, photo-shoot కి తయారయి వచ్చిన దానిలాగా! Camera shyness లాంటిది దీనికి వున్నట్లుగా కనుపించదు….ఎన్ని ఫొటోలు తీసుకున్నా ఏమీ బాధ లేదన్నట్లుగా, ఎంతసేపయినా కూర్చుంటుంది అలాగే!
రోజువారీ భండారాలు: 17/03/2012
ఫొటోగ్రఫీ : Images 2012 – (32)
స్వగతాలు (3) : జ్ఞాపకం
జ్ఞాపకం
ప్రతి జ్ఞాపకానికీ వేలిముద్ర లాంటి ఒక personal ముద్ర వుండడమన్నది వాటి నైజం.
Memory loss అంటే?
జ్ఞాపకం పోవడం….అంతే!
ముఫ్ఫై నలభై ఏండ్లుగా వెంట పడి వున్న ఒక జ్ఞాపకాన్ని
ఎలక్ట్రానిక్ కాగితం మీదికి – అదే కంప్యూటర్ స్క్రీన్ మీదికి – వ్రాయడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక గంటా?
రెండు గంటలా?
మూడూ? నాలుగూ? ….. పోనీ ఒక రోజు!
జ్ఞాపకం పోవడం అంటే
ఒక memory మన నుంచి వేరై పోవడం – అంతే!
Memory ని Memory గానే మాటలలో మూట కట్టి బయటికి నెట్టేయడంలో పోయే ప్రతి జ్ఞాపకం, తన వెంట ఒక తనువంత అనుభూతి బరువును తీసుకొని పయనమై పోయినట్లనిపించకపోవడం తెలియకుండా జరిగిపోతుంది.
వ్యక్తి హరువును జ్ఞాపకాల బరువు నిర్ణయించడమన్న తెలియని నిజం, తేలికైపోయిన జ్ఞాపకాల బీరువాలోని చీకటిలోనికి తొంగి చూసుకుని ఒకానొక రోజు తముళ్ళాడుకోవాల్సి రావడం జరిగినప్పుడు, ఒక్కసారిగా తెలిసి భయపెట్టే క్షణం రాకూడదనుకుంటాను!
అన్నీ అయి పోయి
ఎప్పటికైనా సరే, చెప్పడానికి ఇక ఏమీ మిగలకుండా అయిపోయి మిగలడం మాటలలో చెప్పలేనంత misery!
Memory loss అంటే?
శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది!



