“నియమం అమోహం కదూ!”
అవాస్తవాన్ని మోహించినంతగా మనిషి వాస్తవాన్ని మోహించలేడనుకుంటాను!
అది imagination కి విరుధ్ధం కదూ!
ఒక చిన్న proposition తో ఇది ఇంకా బాగా అర్ధం అయేలా చెబుతాను…
చలం గారి ‘మైదానం’ లోని ‘రాజేశ్వరి’ ని మోహించినంతగా ఇక్కడ మగ పురుషులు ఇంకా కాని ‘భార్య’ ను సైతం మోహించలేరని నేననుకుంటాను!
imagination కి నియమాల్లేవు కదూ!
కాలి వేళ్ళకు మెట్టెలూ, మెడలో తాళీ అక్కరలేదు కదూ!
ఏ నియమమూ లేని అనియమమే ఇక్కడ బుధ్ధికి అతి సులభంగా అర్ధమవుతుంది కదూ!
నియమం అమోహం కదూ!
అనియమమే మోహం కదూ!