రంగుల కల -2
మనిషిగా
ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి
ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ…
ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ…
ఉంటూ చూడడానికీ చూడబడడానికీ…
ఈ రంగులదొక వింత లోకం.
కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం
ఒకానొక ఇంకా మొదలుకాని సంగతిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది.
ఎన్నో వింతలను రాత్రి మోసుకు వస్తుంది.
భయపడతాం భయపెడతాం గానీ, స్వతహాగా చీకటి ఒక సాధువు.
చూడాలని వెలిగిస్తే చిన్నచిన్న సంగతులను కూడా దివ్యంగా వెలిగించి చూపెడుతుంది.
ఈ అనంతమైన విశ్వంలో
ప్రతి రేణువంత ప్రాణికి కూడా ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుంది.
ఎటొచ్చీ, సానుభూతితో సంయమనంతో చూసే చూపే మనిషికి ఉండాలి.
ఎన్ని రంగులో ఎన్నెన్ని చాయలో ఎన్ని మనికిలో ఎన్నెన్ని ఉనికిలో….!
Phaneendra గారు, ధన్యవాదాలు!
all your photos are good and pleasing.your poetic comments on them are equally good.
Thank you very much, Sir, for your appreciative comments!