తెలుగు లిఖిత (సంప్రదాయ) సాహిత్యం -‘చంపూ’ పధ్ధతి…

తెలుగులో లిఖిత సాహిత్యనికి ఆద్యులు  నన్నయ గానే భావిస్తున్నాం గనక,  శాతవాహనుల పాలన మొదలైన క్రీ.పూ.225 నుండి రాజరాజ నరెంద్రుని కాలం వరకూ లెఖ్ఖిస్తే దాదాపు 1200 సంవత్సరాల పాటు, అంటే 12 శతాబ్దాల కాలం పాటు, తెలుగు లో కవిత్వానికి సంబంధించిన ఛాయలు, కనుపించాల్సిన స్థాయిలో, కనిపించక పోవడం దురదృష్టకరం. కారణాలేవైనప్పటికీ, పన్నెండు శతాబ్దాల సుదీర్ఘ కాలంలో శతాబ్దానికొక్క సారైనా తెలుగులో భావవ్యక్తీకరణ జరగాల్సిన సందర్భం, జరిపే ప్రయత్నం జరగలేదంటే నమ్మకం కలగదు. ఇన్ని శతాబ్దాలపాటు ఒక జాతి కవితాత్మ ఎలా స్తబ్దుగా ఊరుకుంటుంది?

ఏదేమైనా, ఇప్పటికి దొరికన అధారాల ననుసరించి, తెలుగు భాషలో వ్రాయబడి ఇప్పటివరకూ దొరికిన పద్యమయ శాసనాలలో మొదటిది అద్దంకి శాసనం, ఇది క్రీ.శ.9వ శతాబ్ది పూర్వార్ధంలో పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుని కాలంనాటిది. రెందవది కందుకూరి శిలా శాసనం, ఇదికూడా గుణగ విజయాదిత్యుని కాలంనాటిదే.

అద్దంకి శిలా శాసనం లో ఒక తరువోజ పద్యం, కందుకూరి శిలా శాసనం లో ఒక సీస పద్యం గుర్తించబడినాయి. కందుకూరి శిలాశాసనంలో ఒక సీస పద్యం వాడబదిందని మొదటగా గుర్తించినవారు శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుగారు.

చంపూ పధ్ధతి లో, అంటే పద్యమూ గద్యమూ కలిసి ఉండే పధ్ధతిలో, వ్రాయడం తెలుగు కంటే ముందునుంచీ కన్నడంలో ఉంది. ‘సంపూ’ అనే మాటకు కన్నడ, తులు భాషలలో ‘కలయిక’, ‘మనోహరము’ అనే అర్ధాలు ఉన్నాయి. అర్ధానికి తగినట్లుగానే, చంపూ పధ్ధతిలో చేసిన రచనలో ‘వచనం’ ఆటవిడుపులా పనిచేస్తూ మొత్తం
రచనకు నిజంగానే మనొహరత్వాన్ని ఇస్తుంది. ‘మొనాటనీ’ ని లేకుండ చేస్తుంది. ఈ కారణంగానే తెలుగు శాసనకర్తలు మొదటగా శాసనరచనలో ఈ చంపూ పధ్ధతిని అనుసరించారు. ఆ పధ్ధతిలోనే నన్నయ మహభారత రచన చేశారు. ఆతరువాతి కాలంలో ‘చంపూ’ పధ్ధతే తెలుగులో కావ్య రచనకు సరైన పధ్ధతిగా స్థిరపడి  పోయింది. ఎంతగా అంటే, వచనం లేకుండా చేసిన రచనకు తిక్కన మహాకవి ‘నిర్వచనోత్తర రామయణం’ అని పేరు పెట్టుకోవల్సినంతగా స్థిరపడిపోయింది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s