తెలుగులో మౌఖిక సాహిత్యం – చాటువు

తెలుగులో చాటు పద్యం ‘చిచ్చుబుడ్డి’ లాంటిది. వెలగడమే కాంతి ఉవ్వెత్తున ఎగసి నలుదిక్కులనూ కమ్మేసే స్వభావం కలిగినటువంటిది.

సరళమైన పదప్రయోగ సామర్ధ్యం, అనర్గళమైన ధారా పటిమ, తెలుగు చ్చందస్సు తో సంపూర్తి పరిచయం ఉన్నవ్యక్తి మాత్రమే చాటు పద్యం చెప్పగలడు.  ఈ మూడు సామర్ధ్యాలతో పాటు మరో ముఖ్య లక్షణం కూడా ఉండాలి. అది ‘విట్’, చమత్కార ఆలోచనా పటిమ, ఆ విధమైన భాషణా సామర్ధ్యం. సహజంగానే ఈ లక్షణం పుష్కలంగా ఉన్న వ్యక్తులు చెప్పిన చాటు పద్యాలు మాత్రమే సజీవంగా నిలిచి ప్రసిధ్ధమయ్యాయి.

చాటు పద్యం అనగానే మొట్టమొదటగా ఙ్నప్తికి వచ్చే పద్యం శ్రీనాధుని ‘సిరిగల వానికి చెల్లును’ పద్యం.  ఎన్నిసార్లు చదువుకొన్నా ఎప్పటికీ నూతనంగా అనిపిస్తుంది.

కం. సిరిగల వానికి చెల్లును
తరుణుల పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగవిడుము, పార్వతి చాలున్.

ఎంత చమత్కారం తో నిండి ఉన్నదీ పద్యం! సరళాతి సరళమైన భాష, ‘వానికి ‘ అన్న పదంతో శ్లేషించిన విధానం, ‘తిరిపెమునకు’ అన్న పదంతో పరమశివుని సంభోదించగల ధైర్యం, ఒకవైపు గంగాదేవిని మాకొదలవయ్యా స్వామీ అని అభ్యర్ధిస్తూనే చివరన తమరికి వొక్క భార్య చాలదా అన్న విసురు…శ్రీనాధుని వల్ల తప్ప వేరే ఎవరివల్లనైనా సాధ్యం అవుతుందా ఇలాంటి పద్యం చెప్పడం? ఇన్ని సంగతులనూ కేవలం 64 మాత్రల (అక్షరాలు కాదు సుమా!) నిడివి తో ఉండేటువంటి కంద పద్యంలో ఇమిడ్చి చెప్పడానికి ఎంతో ప్రఙ్న కావాలి.  అటువంటి ప్రఙ్నశ్రీనాధునికి పుష్కలంగా ఉంది.  అందుకే ఆయన మహాకవిగా మన్ననలందుకుంటున్నాడు, నేటికీ!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s