తెలుగులో కంద పద్యం

‘కందము చతుర్మాత్రా గణ బధ్ధము’  అనేది కంద పద్యానికి సంభందించిన ప్రాధమిక నియమం.
ఈ నియమం ప్రకారం కంద పద్య నిర్మాణంలో ఉపయొగించుకొవాల్సిన గణాలు – నల, భ, జ, స మరియు గగ.
మొత్తంగా 16 గణాలతో నిర్మితమయ్యే కంద పద్యం స్థూలంగా ఒక్కొక్క దానిలో 8 గణాలుండే రెండు పాదాలుగ విభజింపవీలవుతుంది. ఇలా విభజింపడిన రెండు పాదాలూ తిరిగి 3 గణాలతోనూ మరియు 5 గణాలతోనూ ఉండే రెండ్రెండు చిన్నచిన్న పాదాలుగా విభజింపబడి మొత్తంగా నాలుగు పాదాల పద్యంగా తయారవుతుంది.

8 గణాలతో ఉండే ప్రతిపాదమూ గురువుతో అంతమవాలి. 8 గణాల ప్రతి పాదంలోని 6వ గణం జగణము గాని లేదా నలము గాని అయిఉండాలి. జగణము బేసి గణము కారాదు.  అంటే 8 గణాల ప్రతి పాదంలోనూ 1, 3, 5 లేదా 7వ గణం జగణము కారాదు.

నాలుగు పదాల్లోనూ ప్రధమాక్షరం ప్రతిపాదంలోనూ లఘువు గాని గురువు గాని అయిఉండాలి.
ప్రాస నియమం ఉంది.  యతి స్థానం ద్వితీయ మరియు చతుర్ధ పాదాల్లోని 4వ గణ ప్రధమాక్షరం.

కంద పద్యం మీద మక్కువతో కష్టపడి రాసే పద్యాల్లో కష్టమే ఎక్కువగా కనిపించడం సహజం.  స్వకీయమైన ఈ క్రింది రెండు కంద పద్యాల్లోనూ పద్యలక్షణం కన్న కష్టలక్షణమే  ఎక్కువగా కనిపిస్తూ ఉండిఉండొచ్చు. మొదటి పద్యం నన్నయ మహాశయునికి స్తుతిగానూ, రెందవది తెలుగు చాటు కవులను స్మరిస్తూనూ…

కం. అన్నిటికన్నా ముందుగ
నన్నయకు నమ మొనరించున దదియె  నిజమౌ
మన్నన ఏలన తొలి తా
నున్ననె గా వెనుక మనము నిలుచుట కయ్యెన్.

కం.  అలవోకగనూ ఎంతో
చులాక గానూ భలేగ చెవులూరించే
పలురకముల పద్యాలను
పలికిరి మును తెలుగు చాటు పద్యకవు లిలన్.

One thought on “తెలుగులో కంద పద్యం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s