రాజరాజు – నన్నయ (1)

సంస్కృతం లో ఉన్న భారత ఇతిహాసాన్ని తెలుగులో చదువుకోవాలనేది రాజరాజ నరేంద్రుని కోరిక. అప్పటిదాకా తెలుగు భాషలో లిఖించబడి గ్రంథ లేకపోవడమనేది ఒక కొరతగా రాజరాజు భావించి ఉండవచ్చు, ముఖ్యంగా అప్పటికే పొరుగు భాషైన కన్నడం లో గ్రంధితమై కావ్యాలు ఉండడం చేత. కన్నడం లో గ్రంథరచన భారత కధతోనే ప్రారంభమైనది కాబట్టి తెలుగులో కూడ భారత రచన తోనే గ్రంథరచన ప్రారంభం కావాలని అభిలషించి ఉండవచ్చు.

రాజరాజ నరేంద్రుడు క్రీ.శ.1022 నుండి క్రీ.శ.1062 సం., దాక ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. అంటే క్రీ.శ.11వ శతాబ్దం లో ఉండిన రాజుకి ఇదే ఒక కొత్త మరియు ప్రయోజనకరమైన అలోచన. ప్రయోజనకరమైన అన్నది ఎందుకంటే తెలుగులో ఓంప్రథమంగా వెలువడనున్న రచన పూజ్యమైనదిగా అప్పటికే భావింపబడుతూండినటువంటి మహాభారతం అయి ఉండాలని రాజరాజు భావించడం అంత అసమంజసంగా అనిపించదు.

లక్షా ఏడువందల శ్లోకాల సంస్కృత మహాభారతంలో వ్యాస భగవానులు తడమని మానవ జీవిత పార్శ్వం లేదనేది పెద్దల మాట. అట్లాంటి మహాభారతం తెలుగు భాషలోనూ మొదటి రచనగా ఉండాలనుకోవడంలో రాజరాజ నరేంద్రుడు తన ఏలికలో ఉన్న రాజ్యంలో ధర్మోధ్ధరణనే అభిలషించాడు అనుకోవడం తప్పుకాదు.

మక్కికి మక్కి అనువాదంలా కాకుండా, సంస్కృత భారతంలో మానవ జీవనానికి సంబంధించిన ఏఏ అర్ధాలైతే నిరూపితమయ్యాయో వాటినే తెలుగులో చెప్పమని తాను కోరుకొన్న అనువాద పధ్ధతిని రాజరాజు స్పష్ఠంగా నన్నయకు చెప్పాడు.

స్థూలంగా నన్నయ చేసింది కూడ అదే. అయితే నన్నయ ముందుండిన సమస్యలలో అనువాద పధ్ధతి రెండవది.  మొదటి సమస్య అప్పటికి అసలు నిర్దేసింపబడిన నియమాలతో లేని తెలుగు పద్యం, కావ్య నిర్మాణ పధ్ధతి. ఈ రెండింటిని నన్నయ తనకు తానుగానే నియమాలు నిర్దేసించుకుని ముందుకు సాగాడు.  మిత్రుడైన నారాయణ భట్టు సహాయం అవసరమైనప్పుడల్ల తీసుకున్నాడు. నిజానికి అసలు అనువాదంలో కన్న నన్నయ ఇందులోనే ఎక్కువగా కష్టపడి ఉంటాడని నాకనిపిస్తుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s