రాజరాజు – నన్నయ (2)

నన్నయ రచన ఎక్కువగా సంస్కృతపదభూయిష్టంగా ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంది. అంటేఅవసరంకన్నామించి సంస్కృత పదాలు ఉండడంగా ఈ అభిప్రాయాన్ని లేదా విమర్శ ను తీసుకొని ఆలోచిస్తే కొన్ని విషయాలు స్ఫురణకు వస్తాయి.

గ్రంథ రచన చెయ్యడానికి అనువైనదిగా తెలుగు భాష అభివృధ్ధి చెందిందని గుర్తించిన మొదటి వ్యక్తి రాజరాజ నరెంద్రుడు. అప్పటికే వెయ్యేళ్ళగా (గాధా సప్తశతి నాటికే తెలుగు స్వతంత్ర భాషగా ఎదిగి ఉన్నది అని చెప్పడానికి సరిపడా అధారాలు గాధా సప్తశతి లోనే ఉన్నాయి) వాడుకలో ఉన్న తెలుగు భాషలో ప్రజాబాహుళ్యం పాడుకొనే పాటలూ, అప్పుడప్పుడూ శాసనాల్లో దేశీ చ్ఛందస్సులైన కందం, తరువోజ, ఆటవెలది లలో దర్శనమిస్తూ వచ్చిన పద్యరచన, రాజరాజు యొక్క పై నిర్ణయానికి ఆలంబనగా నిలిచియుండవచ్చు.

పండితత్వానికి ప్రతీక సంస్కృతం. తెలుగు పామర భాష అనడం కంటే పండితేతర భాష అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే పూర్తిగా అభివృధ్ధి చెందిన తెలుగు భాషలో పండితులు సైతం సంభాషించుకునే వారనీ, నిత్య వ్యవహారంలో వాడేవారనీ అనుకొవడంలో తప్పేమీలేదు.

రాజరాజుకూ నన్నయభట్టుకూ మధ్య మహాభారత ఆంధ్రీకరణాన్ని గురించిన సంభాషణ తెలుగులోనే జరిగిఉండవచ్చు. ఇరువురూ సంస్కృతంలో కంటే తెలుగులోనే సంభాషించుకొని ఉంటారని అనుకుంటేనే సమంజసంగా ఉంటుంది.

అయితే, రాజరాజు నన్నయను మహాభారత గ్రంథాన్ని ఆంధ్రీకరించమని చెప్పినప్పుడు వారి ఉద్దేశ్యంలో నన్నయ మహాభరాత ఆంధ్రీకరణలో వాడాల్సిన భాష అప్పుడు వారిద్దరూ వ్యవహారంలో మాట్లాడుకొంటూండిన భాష మాత్రం అయి ఉండదు. రాజరాజు ఉద్దేశ్యంలో నన్నయ తెలుగులో గ్రంథరచనకు కావల్సిన భాషను తనకు నచ్చిన విధంగానూ, ఆనాటి పండితవర్గానికంతటికీ నచ్చే విధంగానూ తయారు చేసుకోవాలనే అనుకోవడం సబబుగానే ఉంటుంది.

రాజరాజు మాట ఎలా ఉన్నా, అనాడు జనసామాన్యంలో వాడుకలో ఉన్న తెలుగు భాష స్వరూపం నన్నయకు తెలియకుండా ఉండదు. అప్పటిదాకా శాసనాలలో వాడబడుతూండిన తెలుగు భాషా స్వరూపం నన్నయకు తెలుసు. శాసనాలలో వాడబడిన భాషను అధికారిక భాషగా గ్రహించడంలో అనౌచిత్యం లేదు గనుక తెలుగులో గ్రంథ రచనకు వీలైనటువంటి భాషాస్వరూపంగా నన్నయ దానినే స్వీకరించడం కూడ సహజమే.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s