రాజరాజు – నన్నయ (3)

నన్నయ రాజరాజుకు కులబ్రాహ్మణుడు, అనురక్తుడు. రాజరాజు దృష్టిలో నన్నయ అవిరత జపహోమతత్పరుడని, విపుల శబ్దశాసనుడని, సంహితాభ్యాసుడని, బ్రహ్మాండాది నానాపురాణవిజ్ఞాననిరతుడని, పాత్రుడని, ఆపస్థంబసూత్రుడని, ముద్గలగోత్రుడని, సద్వినుతావదాతచరితుడని, లోకజ్ఞుడని, ఉభయభాషాకావ్యరచనాభిశొభితుడని, సత్ప్రతిభాభియోగ్యుడని, నిత్యసత్యవచనుడని, సుజనుడని నన్నయ తనకుతానే చెప్పుకొన్న మాటలు ఆంధ్ర మహాభారతం 9వ పద్యం వల్ల మనకు అవగతమౌతుంది. తృతీయ పురుష (third person) లో narrative లా సాగే పద్య నిర్మాణం ఈ విధమైన వర్ణనను సులభతరం చేసింది. రచన చేస్తూన్న నన్నయ తనను, తన ప్రభువైన రాజరాజునూ రచనలో పాత్రధారులనుగా చేసుకొని సాగించిన రచనా విధానం ఇది. ఇలాంటి ఇప్పటి తరహా రచనా విధానాన్ని అప్పుడు, అంటే క్రి.శ.11వ శతాబ్ధంలోనే, నన్నయ ఊహించి కల్పించడానికి ముఖ్యమైన కారణం రాజరాజు వ్యక్తిత్వాన్ని, కోరికనూ భావితరాలకు తెలియజెప్పాలని నన్నయ త్రికరణశుధ్ధిగా భావించి ఉండడంగానే అని నాకనిపిస్తుంది.

తెలుగు భాషలో కావ్య రచన ఆరంభం కావడానికి, అది సంస్కృత మహాభారతం ఆంధ్రీకరణం ద్వారా జరగడానికి, రెంటికీ బాధ్యుడు రాజరాజు అన్నది లోకానికి తెలియడం నన్నయ ముఖ్య ఉద్దేశ్యం. అందులోని మంచైనా, చెడైనా రాజరాజుకే చెందాలని నన్నయ అభిలషించాడని చెప్పవచ్చు.

రాజరాజు కోరికను విన్న నన్నయ వినమ్రతతో అన్ని విధాలా అలోచించి చివరికి ‘నా నేర్చు విధంబున’ మహాభారతాన్ని రచిస్తానని తెలుపుతాడు (ఆంధ్ర మహాభారతం  20 వ.). ఇందులో ‘నా నేర్చు’ అనే పదప్రయోగం ఇప్పుడు లేనిది.  అప్పుడు, అంటే క్రి.శ.11వ శతాబ్దిలో ఏ అర్ధంలో వాడబడినదో తెలియనిది. ఇది ‘ఎప్పటికప్పుడు ఉచితమని తోచిన  పధ్ధతిలో ‘ అనే అర్ధాన్ని సూచిస్తుందని నాకనిపిస్తుంది. తాను నేర్చుకొంటూ, నేర్చుకుంటూన్నదాన్ని రచనగా ముందుంచుతూ భారత అంధ్రీకరణాన్ని కొనసాగించడంగా నన్నయ ఈ పదానికి అర్ధనిర్దేశంచేసి ఉపయోగించాడని నా భావన.

రాజరాజు కోరిక తీర్చే మార్గాన్ని ఊహించి, దర్శించి పద్యరచనగావించే ప్రక్రియలో ముందుతరాలకు మార్గదర్శకుడై నిలిచాడు నన్నయభట్టు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s