రాజరాజు – నన్నయ (4)

రాజరాజు ఎలాంటివాడు?’ అనే ప్రశ్నకు సమాధానం ఆంధ్ర మహాభారతం ప్రధమాశ్వాసంలోని 10వ పద్యం, 11వ వచనం మరియు 12వ పద్యంలో కొంత దొరుకుతుంది.

మనసులో వేరే ఏ ఆలోచనలూ లేని చిత్తంతో పురాణాలు చాలా విన్నవాడూ, అర్ధ ధర్మ శాస్త్రముల లోని పధ్ధతులు తెలుసుకున్నవాడూ, ఉదాత్త రసాన్విత కావ్య, నాటకాల సొగసులనెన్నిటినో ఆస్వాదించినవాడూ, ఈశ్వరార్చన యందు భక్తితో హృదయాన్ని లగ్నం చేసినవాడూ అయినటువంటి ధర్మచిత్తుడూ, మెత్తని మనిషీ అనిపిస్తాడు రాజరాజు.

ఇంత వ్యాసంగం తరువాత గూడ మహాభారతం మీద ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది రాజరాజుకు. అందుకే తనకు అమితంగా ఇష్టమైన అయిదు అంశాల్లో రెండవదిగా భారత శ్రవణాసక్తిని చెప్పుకున్నాడు.

ఆంధ్ర మహాభారతంలోని 16వ పద్యం నన్నయ వ్రాసిన రెండవ కంద పద్యం.  సంస్కృత మహాభారతంలోని ఏఏ విషయాలు తెలుగులోకి ఎలా రచింపబడాలని రాజరాజు కోరుకున్నాడో స్పష్టంగా తెలియచెప్పే పద్యం ఇది.

“జననుత కృష్ణద్వైపాయన మునివృషభాభిహిత మహాభారత బ
ధ్ధ నిరూపితార్ధ మేర్పడ తెలుగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్”

వ్యాసులవారు తమ అంతరంగంలో ఏఏ అర్ధాలనైతే మహాభారతంలో బంధింపబడి నిరూపితమవ్వాలని కోరుకున్నారో వాటినే స్పష్టంగా అర్ధమయేలా తెలుగుభాషలో రచింపమని రాజరాజు ఆదేశం. రాజరాజు ఉద్దేశ్యంలో నన్నయ చెయ్యాల్సినపని సంస్కృత మహాభారతాన్ని తెలుగు భాషలోకి మక్కీకిమక్కి అనువాదం కానేకాదు. నన్నయ చేసిందికూడ కేవలం అనువాదం కానేకాదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s