ఆపస్తంబుడు – ఆంధ్ర జాతి(1)

ఆంధ్ర మహాభారతం రచించే ప్రక్రియలో భాగంగా నన్నయ తనను గురించి చెప్పుకున్న మాటల్లో ‘ఆపస్తంబ సూత్రుండను’ అనే మాట ఒకటి ఉంది.  ఈ మాట దేనిని సూచిస్తుందో తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో తెలిసిన వివరాలు ఇవి:

1. సూత్రీకరించబడిన గృహ్యవిధులను గృహ్యసూత్రాలు అంటారు. ధర్మసూత్రాలలో ఇవి ఒక భాగం.
2. ధర్మసూత్రాలను రచించిన పందొమ్మిదిమంది ధర్మ శాస్త్రవేత్తలలో ఆపస్తంబుడు ఒకరు.  మిగిలన పదునెనిమిదిమంది, వరుసగా – మనువు, అత్రి, విష్ణువు, హారీతుడు, యాజ్ఞవల్క్యుడు, ఉశనుడు, అంగిరసుడు, యముడు, కాత్యాయనుడు, బృహస్పతి, పరాశరుడు, వ్యాసుడు, శంఖుడు, లిఖితుడు, దక్షుడు,
గౌతముడు, శాతాతపుడు, వసిష్ఠుడు. ఈ వరుసలో ఆపస్తంబుడు యమునికి తరువాత, కాత్యాయనునికి ముందున్నవాడు.
3. ఆపస్తంబుడు మహాభాష్యకారుడైన పతంజలికి సమకాలికుడు గాని అంతకు పూర్వుడు గాని అయి ఉంటాడని ఊహ. అంటే క్రీ.పూ.600 ప్రాంతపు వాడు గాని లేదా అంతకు పూర్వుడు గాని అయి ఉండాలి.
4.ఆపస్తంబుడు ఆంధ్రుడని ఒక అభిప్రాయం ఉంది. ఆంధ్రులలో నూటికి డెభ్భై మంది తమ గృహ్య విధులను ఆపస్తంబుని గృహ్యసూత్రాలను అనుసరించి నిర్వర్తించడం ఈ అభిప్రాయానికి బలాన్నిచ్చే అంశాలలో ఒకటి. ఇదే గాక ‘చరణ వ్యూహమ’ నే ఒక ప్రాచీన గ్రంధం లోని ‘మహార్ణవ తంత్రము’ లోనివైన ఈ క్రింది శ్లోకాలు  గూడా ఆపస్తంబుడు ఆంధ్రుడనే ఊహకు ఆలంబనగా నిలుస్తాయని విజ్ఞుల అభిప్రాయం.

శ్లో.  పృధివ్యా మధ్యరేఖాచ నర్మదా పరికీర్తితా,
దక్షిణోత్తరయోర్భాగే శాఖా భేదశ్చ ఉచ్యతే
నర్మదా దక్షిణే భాగే హ్యపస్తంబాశ్వలాయనీ,
ఆంధ్రాది దక్షిణాగ్నేయా గోదా సాగర పావధి,
యజుర్వేదస్తు తైత్తిర్యో హ్యాపస్తంబీ ప్రతిష్ఠితా.

ఈ శ్లోకాల అర్ధం : భూమధ్య రేఖయందు నర్మాదా నది చెప్పబడెను. ఆ నదికి దక్షిణోత్తర భాగాలలో శాఖాభేదం చెప్పబడెను. నర్మదా నదికి దక్షిణ భాగాన ఆపస్తంబ, అశ్వలాయన శాఖలు కలవు. ఆంధ్రలో దక్షిణాగ్నేయ దిక్కులలోనూ, గోదావరి మొదలు సాగరము వరకూ యజుర్వేదము యొక్క తైత్తిరీయ శాఖ, ఆపస్తంబీయం, ప్రతిష్ఠింపబడెను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s