ఆపస్తంబుడు – ఆంధ్ర జాతి(2)

ఆపస్తంబుడు కల్పసూత్రాలను 30 ప్రశ్నలుగా రచించాడు.  అందులో మొదటి 24 ప్రశ్నలూ శ్రౌతసూత్రాలు. 25వ సూత్రం పరిభాష.  26, 27 సూత్రాలు గృహ్యసూత్రాలు. 28,29 ధర్మసూత్రాలు. 30వ ప్రశ్న శల్భసూత్రం. ధర్మసూత్రాల్లో తనకంటె ముందున్న మను, బోధాయన, యాజ్ఞావల్క్యాదులు అంగీకరించిన ‘నియోగ’ పధ్ధతిని ఆపస్తంబుడు ఖండించాడు.  స్వస్త్రీ పాతివ్రత్యాన్ని కాపాడుకొనే విధిని పురుషునిపైఉంచి ప్రోత్సహించాడు.

ఆపస్తంబుడు బోధాయనుని శిష్యుడని లోకంలో వాడుక ఉంది.  అయినప్పటికీ తప్పనిపించినచోటల్లా గురువుని ఖండించడానికి వెనుకాడని వ్యక్తి ఇతడు. మిగతా సంగతులెలాఉన్నా స్త్రీపురుష సంబంధాల విషయంలో, ముఖ్యంగా వివాహ ప్రక్రియకొక పధ్ధతిని నిర్దేశించినది ఆపస్తంబ, అశ్వలాయనులే అన్నది గమనార్హం.
కన్యావరణము, వరాన్వేషణము, మధ్యవర్తులు సంబంధములను కుదుర్చుట, సక్రమమైన వివాహ పధ్ధతి ఆపస్తంబ, అశ్వలాయనుల గృహ్యసూత్రాల రచనాకాలం తరువాతనే అమలులోకొచ్చింది.

ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతుడు కూడ ఈ సందర్భంలో స్మరించదగినవాడు.  స్వస్త్రీ పాతివ్రత్యాన్నికాపాడుకోవడం అనే విషయంలో తండ్రి అయిన ఉద్దాలకుని అభిప్రాయాలను సైతం గర్హించి ఖండించినవాడుశ్వేతకేతుడు. ఆపస్తంబ, అశ్వలాయన, శ్వేతకేతుడు – ఈ మువ్వురినీ స్త్రీపురుష సంబంధాల్లో సంస్కరణలుతెచ్చి,వివాహమనే వ్యవస్థ వెళ్ళూని నిలదొక్కుకోవడానికి మూలమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు.

ఆపస్తంబుడు ఆంధ్రుడు అయినా కాకపోయినా, అతడు చూపించిన మార్గాన్ని అందిపుచ్చుకుని క్రీ.పూ.600 సం. ప్రాంతాల్లోనే చైతన్యవంతము, వివేకవంతము అయిన జాతి ఆంధ్ర జాతి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s