నా వచన కవితలు (1)

వలసొచ్చిన కలా…వానా!

అతడు తన చిరకాల స్వప్నాన్ని జీవించేందుకు
ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉంటాడు.

ఒక చిన్న పల్లెటూరు
ఆనుకుని ఆపక్కనే అనునిత్యం ప్రవహిస్తూ
అంతే ముచ్చటైన చిన్న నదీ…

ఒడ్డునే ఒక పధ్ధతిగా పెరిగిన చౌక చెట్ల సముదాయం
ఆవెనుక ప్రకృతిలో కలిసిపోయి గుంపులుగుంపులుగా తుప్పలూ
చిన్న చిన్న మొక్కలూ…

గట్ల మధ్య విస్తరించుకున్న పెద్ద పెద్ద పొలాలూ
మొలకెత్తడానికి సిధ్ధమైన మట్టి చాళ్ళలో
నాగళ్ళ మమతానురాగాల నడకలూ…

ఏటికావలి వొడ్డు ఇసుకలో చలమలూ
భుజాల మీద కావిళ్ళలో ఇళ్ళకెళుతూన్న మంచినీళ్ళ కడవలూ…

ఇదీ అతని కల
ఎప్పుడో ఎన్నో ఏళ్ళక్రితం పొట్టచేత పట్టుకుని
నగరానికి వలసవచ్చినదీ కల.

నీరు పల్లెనొరుసుకుంటూ  ప్రవహించే నదిగా ఉన్నప్పుడు
ఏనాడూ భయపెట్టలేదు.
ఆఖరికి పొంగి పోటెత్తడానికి సిధ్ధమౌతున్న వైఖరిలో కూడా
నడుముల్లోతు నీళ్ళలోంచి
మంచినీళ్ళ కావడిని ఒంటిచేత్తో భుజానికింకా పైకెత్తిపట్టుకుని
ఒడ్డు చేరిన జ్ఞాపకాలు ఎన్ని లేవు?

నగరంలో మరి ఈమధ్యనెందుకో
నీరు బొట్టుగాఉన్న వైఖరిలోగూడా భయపెడుతోంది.
పిల్లవాడిగా, పల్లెవాడిగా, పల్లెంతవాడిగా ఉన్నప్పుడు
వానజల్లు పడితే ఒంటిమీద వెన్నెల కాసినట్లుండేది.

మరిప్పుడీ నగరంలో
జల్లుజల్లుకీ గుండెల్లో ఝల్లుమనే అలజడులేమిటి?
నగరంలో వాన
నిలుచున్నపళాన్నే నట్టేట్లో ముంచేట్లుంటున్నందుకేగా మరి.

2 thoughts on “నా వచన కవితలు (1)

  1. శ్రీ వెంకట్ గారికి, నమస్కారములు.

    మీ కవితలన్నిటినీ చదివాను. “వానజల్లు పడితే ఒంటిమీద వెన్నెల కాసినట్లుండేది.” ఈ వాక్యం మీ కవితల్లోని మీ భావాలకు బంగారపు మచ్చుతునక. పచ్చటి గరికను, నీలిరంగుల నెమలి ఈకను బుగ్గలపై రుద్దుకుంటుంటే ఆ మెత్తటి అనుభూతి ఎట్లావుంటుందో, మీ కవితలు కూడా నాకు అలాంటి అనుభూతినే కల్గించ్చినాయి. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. మరెన్నో చక్కటి కవితలను మీనుంచి ఆశిస్తూ,
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s