పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (2)

ఛందస్సుకు సంబంధించిన అవసరాల కోసం తెలుగు పదాలను రూపాంతరం చెందించి ప్రయోగించి అధిక్షేపణకు గురియైన సందర్భం ఒకటి, శ్రీక్రిష్ణదేవరాయల కాలానికి చెందినది, ఇక్కడ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. రాయలవారి ఆస్థానంలో రాయలవారి చేతనే ఆంధ్ర కవితా పితామహునిగా సంబోధింపబడినటువంటి అల్లసాని పెద్దన ఒకానొక సందర్భంలో ప్రస్తావవశాన చెప్పినదిగా ప్రసిధ్ధమైన ఒక చాటు పద్యం:

కం. కలనాటి ధనము లక్కర
గల నాటికి దాచ కమలగర్భుని వశమా?
నెల నడిమి నాటి వెన్నెల
అలవడునే గాదె బోయ అమవస నిసికిన్?

ఇంత చక్కటి చాటు పద్యంలో, ‘అమావాశ్య’ అనే పదం ‘అమవస’ గా మార్చబడి పెద్దన గారి చేత ప్రయోగించబడడం కేవలం ఛందస్సుకు సంబంధించిన అవసరం కోసమే అన్నది ఇక్కడ స్పష్ఠమే. పెద్దన అంతటి కవి చేసిన ప్రయోగం కాబట్టి తప్పు బట్టడం సముచితం కాదని ఎవరనుకుని  సమాధానపడి ఊరుకుండినా, తెనాలి రామక్రిష్ణుడు అలా సమాధానపడి నిమ్మకుండే వ్యక్తి కాదు కదా! పెద్దన చేసిన అపప్రయోగంపై తన అధిక్షేపాన్ని పద్యరూపంలోనే చెప్పినట్లుగా ప్రసిధ్ధమైన తెనాలి రామక్రిష్ణుని చాటు పద్యం:

కం. ఎమి తిని సెపితివి కపితము?
బ్రమపడి వెరి పుచ్చకాయ వడి దిని సెపితో?
ఉమెతః కయ తిని సెపితో
అమవసనిసి అన్న మాట అలసని పెదనా!

తెనాలి రామక్రిష్ణుని కవితా ప్రతిభకు అద్దంపట్టే చాటు పద్యం ఇది. పెద్దన గారి పద్యాన్ని ఈ  పద్యాన్ని పక్క పక్కనే చదివి అర్ధంచేసుకోవాల్సిందే తప్ప ఈ పద్య సౌందర్యాన్ని గుఱించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ‘ఏమి’ అన్న పదానికి బదులుగా ‘ఎమి’ అని, ‘చెప్పితివి’ అన్న పదానికి బదులుగా ‘సెపితివి’ అని, ‘చెప్పితివా’ అన్న పదానికి బదులుగా ‘సెపితో’ అని, ‘ఉమ్మెత్త కాయ’ అన్న పదానికి బదులుగా ‘ఉమెతః కయ’ అని, చివరికి ‘అల్లసాని పెద్దనా’ అన్న పదానికి బదులు ‘అలసని పెదనా’ అని చేసిన ప్రయోగాలన్నీ పెద్దన గారు ‘అమవస నిసి’ అని చేసిన అపప్రయోగాన్ని ఎత్తి చూపుతూ చేసిన పద ప్రయోగాలే. ‘అధిక్షేపాన్ని ఇంత అందంగా చేయగల కవి తెలుగులో ఒక్క తెనాలి రామక్రిష్ణుడు తప్ప మరొకరున్నారా?’ అంటే సందేహమే!

ప్రకటనలు

3 thoughts on “పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (2)

  1. శ్రీ వెంకట్ గారికి, నమస్కారములు.

    చమత్కారమైన, చాలా చక్కటి, చక్కెరలాంటి పద్యాలను ఉదహరిస్తూ, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అందంగా వివరించారు. ఇటువంటివి ఇంకెన్నో మీనుంచి వినాలని ఆశిస్తూ, ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ,
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • శ్రీ మాధవ రావు గారికి, ధన్యవాదములు. మీకూ, మీ గృహములో అందరికీ మా దీపావళి శుభాకాంక్షలు. నమస్కారాలతో, వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s