నా వచన కవితలు (7)

వైనాలు

మహీజంలా పాదం ఎప్పుడూ
మట్టినే అంటిపెట్టుకుని వుంటుంది.
ఊహ మాత్రం గాలిపటంలా ఎగిరి
అంబరాన్ని చుంబించాలని చూస్తుంటుంది.

మొగిలిపూవులా మనసెప్పుడూ
పరిమళాల్ని పక్కనబెట్టి
పాముల్ని ఊహల్లోకి తెచ్చుకుంటుంటుంది.

ఎక్కడ దాచిన జ్ఞాపకం అక్కడే ఉన్నట్టు
చేతన కోల్పోయిన జ్ఞానం
ఏ కొత్త అనుభవానికీ అయస్కాంతమవదు.

అలవాటైన దారిలో
బతుకలా అలవోకగా గడిచిపోవాల్సిందే తప్ప
సుప్త హృదిలో విడిదిచేసుండే తప్త రుచులను గురించి
గుప్తంగానైనా విడదీసి చూసుకోదు.

ఇంత జరుగుతున్నా
ఎంత నిద్రాణమైఉన్న జగత్తులో సైతం
ఓ మూలన ఎక్కడో
ఓ స్వప్నం మేలుకునే ఉంటుంది.

గాయపడ్డ దీపంలానైనా
సత్యం వెలుగుతూనే వుంటుంది.

ప్రకటనలు

2 thoughts on “నా వచన కవితలు (7)

 1. శ్రీ వెంకటరావు గారికి, నమస్కారములు.

  `ఏ కొత్త అనుభవానికీ అయస్కాంతమవదు’ – అయస్కాంతమవదు చక్కటి పదాన్ని వాడారు. అలాగే, `గాయపడ్డ దీపంలానైనా సత్యం వెలుగుతూనే వుంటుంది.’ – ఇది చాలా చక్కటి ఉపమానం. మంచి కవితని అందించారు.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 2. శ్రీ మాధవ రావు గారికి,
  కవిత నచ్చినందుకు సంతోషం. ఇంకా, కవితలోని కొన్ని పదాల ప్రయోగం నచ్చినందుకు మరీ సంతోషం!
  ధన్యవాదములతో,
  వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s