తెలుగు పద్యం పోకడలు (1)

క్రీ.శ.11వ శతాబ్ది ప్రధమార్ధంలో సంస్కృత మహాభారత ఆంధ్రీకరణ ప్రక్రియ రూపేణా నన్నయ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైది మొదలు, చందోబధ్ధ తెలుగు పద్యం ర రకాల పోకడలు పోయింది. నన్నయ తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకంతో సమానమైన ఉదాత్తతను సమకూర్చి పెడితే, తిక్కన మహాశయుడు తనదైన ఒక ప్రత్యేకమైన రాజసాన్ని, నడకనూ ప్రసాదించి పెట్టాడు.  శ్రీనాధుడు తెలుగు పద్యానికి తనదైన శైలిలో సరసతను చేకూర్చి పెడితే, పోతన భక్తి ని ప్రసాదించాడు.  పింగళి సూరన అనన్య సామాన్యమైన కల్పనా చాతురిని, పాల్కురికి సోమనాధుడు ప్రాంతీయ సౌరభాన్ని…..ఇలా తెలుగు పద్యం ఒక్కొక దశలో ఒక్కో రకమైన పోకడ పోయి కనిపిస్తుంది.

వీరంతా పద్య రచనలో నిష్ణాతులైన ప్రసిధ్ధ కవులు.  తమ ప్రతిభతో తెలుగు పద్యాన్ని తమదైన ప్రత్యేక శైలిలో నడిపించడంలో కృతకృత్యులైన వారు.  వీరి చేతులలో తెలుగు పద్యం రక రకాల పోకడలు పోవడంలో పెద్దగా ఆశ్చర్య పోవాలిసిందేమీలేదు.  ఆశ్చర్యం కలిగేదల్లా, సమాజంలో సాధారణ వ్యక్తులుగా పరిగణింపబడే వారి చేతుల్లో తెలుగు పద్యం పోయిన పోకడలను చూసినప్పుడే!

ఉదాహరణకి, కొన్ని శతాబ్దాల క్రితం రాజుల కాలంలో, ఒక విద్యావతియైన వేశ్య తనను పోషిస్తూన్న మహారజుకి వ్రాసిన ఒక ఉత్తరంలోని ఈ సీస పద్యం:

“ఉండుండి యేమేమొ వూరకే చింత్తింత్తు
చింత్తించి నాలోనె చింన్నబోదు
చింన్న బోయి యొకింత్తశేపు తెలివిగ నుంద్దు
తెలివి వ్యాళను మిమ్ము తలపువచ్చు
తలచినంత్తనె వచ్చి నిలిచినట్లనె తోచు
తోచి నే దిగ్గున లేచిజూతు
జూచి వేగమె బారజూచి కౌంగిట గుత్తు
గృచ్చి కౌంగిట లేక వెచ్చనూర్తు

వెచ్చనూర్చియు తపియింత్తు వెతలనింత్తు
సఖుల గద్దింత్తు తెగువ యోచన తలంత్తు
నీదు మనసెంత్తు అంత్త నంన్నియు శమింత్తు
భవ్య గుణ హారి, వేణుగోపాల శౌరి”.

ఒక చిన్న సైజు documentary ఈ పద్యం.  అక్షరాల్లో ఒక చలన చిత్రాన్ని రూపించడం సాధ్యమౌతుందా? అని సందేహపడే వ్యక్తులకు ఈ పద్యాన్ని చూపి సమాధానం చెప్పొచ్చు, సాధ్యమౌతుందని. తిక్కన గారు వర్ణించిన ద్రౌపది చలన శీల అని మహాకవి శ్రీశ్రీ గారు వ్రాయగా చదివినట్లు గుర్తు. ఆమె వ్యక్తిత్వానికి చలన శీలత్వమనేది కేంద్ర బిందువుగా తిక్కన గారు గుర్తించి ప్రయత్నపూర్వకంగానే నిర్వహించిన కార్యం అది. అందుకనే, ఆంధ్ర మహాభారతం సంస్కృత మాహాభారతానికి కేవలం అనువాదంకాకుండా నిలిచింది.

నడకలోనూ, సందేశంలోనూ పై పద్యం, వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లోని ఈ క్రింది పద్యాల్ని గుర్తుకు తెస్తుంది.

గతిరసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యోమధు
వ్రత! వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి వటవీ ప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గునన్
గతిచెడి సంచరించెదవు, ప్రాబడిపోయెనె నీ వివేకమున్.

చేర వచ్చివచ్చి దూరంబుగా బోదు
డాయ వత్తు దవ్వు పోయిపోయి
మాట లింక నేల మాపాలిటికి నీవు
మాయలేడి వైతి మంచి రాజ!

ఒక నాటకానికి ఇంతకంటె కమనీయమైన ప్రస్తావనను ఊహించలేం.  కామమంజరి అనే పునర్భువు, వేశ్య, ఆమెయందు బధ్ధానురాగుడైనటువంటి గోవింద మంచన శర్మ అనబడే, కార్యాంతరం ప్రవాసంలో ఉన్న వ్యక్తి (క్రీడాభిరామం లో నాయకుడు) ని ఉద్దేశించి పంపిన సందేశం ఇది. “మా పాలిటికి నీవు మాయ లేడి వైనావు మంచరాజ!”…ఎంత హృద్యమైన భావన!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s