“మర్మ కౌముది” – నా వచన కవితలు (8)

మర్మ కౌముది

వెన్నెల్లో కురిసిన వాన చినుకుల్లా
రెప్పల అంచుల్లో
కనిపించకుండా మెరుస్తూన్న మోహాశ్రు శకలాలూ…

ఒక అల వెనకాల దాక్కునున్న
కల లాంటి కోరిక తలుపులు తెరుచుకుని
వెలుపలికి రాజూసిన
చేయిజారిన జాడతెలియని విన్నపాల సమూహాలూ…

విడిది చేసున్న హృదయపు నర్మావశేషాల మడతలలో
శిధిలాలుగా పడి తపిస్తూన్న
తృష్ణార్ద్ర స్వప్న సంచయాలూ…

శొధిస్తే
అంతరంగ చిత్రాలుగా ఆవిష్కృతాలయ్యే
ఇలాంటివే ఇంకా ఎన్నెన్నో దృశ్యాలు.

తనువొకటి తపోవనంలా
సకల సమీకరణాలకూ ఆశ్రయమౌతుంది.

తలపుల లోపల ఎన్ని తమో రణాలవుతున్నా
మదిలోపలి మరుపొకటే
మనుషుల పాలిటికి మర్మ కౌముది.

ప్రకటనలు

2 thoughts on ““మర్మ కౌముది” – నా వచన కవితలు (8)

  1. Dear sree Venkat,

    మీ హృదయావిర్భ వ
    భావ సంచయం !!!
    ఓ అద్భుత పద నృత్య
    విన్యాసం ……

    మీ “మర్మ కౌముది” లో

    “విడిది చేసున్న హృదయపు
    నర్మావశేషాల మడతలలో
    శిధిలాలుగా పడి తపిస్తూన్న
    తృష్ణార్ద్ర స్వప్న సంచయాలూ”

    అక్షరాలు పదాలుగా మారి
    భావాలలో దూరి
    కవితలుగా నరితిస్తే !!!!….
    యిలా ఉంటుందా !!!!
    మహాద్భుతం .
    అభినందనలతో …శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s