సామెతలూ, వాటి సంగతులు.

‘ఒక సంగతికి దృష్టాంతముగా లోకులు వాడుకగా చెప్పే మాట’ అని తెలుగు సామెతకు బ్రౌణ్య నిఘంటుకారులు ఇచ్చిన నిర్వచనం.  లోకులు వాడుకగా చెప్పే మాట గాబట్టి సామెతకు ‘లోకోక్తి’ అని ఇంకొక పేరు. సంభాషించేటప్పుడు సందర్భానికి తగినట్లుగా సామెతను తగిలించి సంభాషించడం ఒక కళ. దీనికి సామెతల మీద తగినంత పరిజ్ఞానం ఉండడమే కాకుండా, తగినన్ని సామెతలు బుధ్ధిలో నిక్షిప్తమై ఉండాలి. అవసరానికి తగినట్లుగా అవి జ్ఞాపకం రావడంగూడా అంతే ముఖ్యం.  నిన్న మొన్నటిదాకా, కొంతమంది పెద్దల సంభాషణలలో, వ్రాతలలో సామెతల వాడకం చాలా విరివిగా కనిపించేది.  ఏకారణంచేతనో ఇప్పుడది కొంత తగ్గిందనే చెప్పాలి.  సామెతలు మౌఖిక సాహిత్యంలో ఒక భాగం.  వాటిని కాపాడుకోవడం, వాడకాన్ని పునరుధ్ధరించడం, పెంచడం భాషాభివృధ్ధి దృష్త్యా ఒక అవసరం.

ప్రతి సామెత పుట్టుకకూ మూలమై  తప్పనిసరిగా చిన్నదో, పెద్దదో ఒక కథ ఉంటుంది.  బ్రౌణ్య నిఘంటుకారులు దీనినే తమ నిర్వచనంలో ‘సంగతి’ అన్నారు.  ఈ కథకు లేదా సంగతి కి అత్యంత సంక్షిప్త రూపంగా సామెత పుడుతుంది.  ఉదాహరణకు:

కసి తీరక మసి పూసుకున్నాడు” అనే సామెత. మన్మధుడిని దగ్ధం చేసినా పరమశివునికి కోపంతీరక ఆ బూడిదను ఒంటికి రాసుకున్నడట.  ఈ సామెత పుట్టుకకు ఈ సంగతి మూలం.

పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ” అని ఒక నానుడి ఉంది.  దీనికి మూలం పెన్నానది తీరాన గల (నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం – దొడ్ల వారి సంస్థానం) రంగనాధుని ఆలయంలో జరుగుతూండిన నృత్యసేవ అట.

హంస కుయ్యగానే ఛస్తుందని” ప్రతీతి.  దీనికి దృష్టాంతమేదో తెలియదు.

మనం సర్వ సాధారణంగా వినే “గాదిద గుడ్డు, కంకర పీసూ” అనే నానుడి.  ఇది God the good! Conquer peace! అనే ఆంగ్ల లోకోక్తి కి అపభ్రంశ, గ్రామ్య రూపంగా తెలుస్తుంది. ఇక –

“ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుని బండియైనా బాఱదు”

తినక తీపూ చేదూ తెలియవు, దిగక లోతూ పాతూ తెలియవు”

“బాధ వచ్చు దినములును భాగ్యము వచ్చు దినములును తెలియవు.”

ఇలాంటి సామెతలకు వేరే దృష్టాంతాలు అవసరంలేదు. సర్వ జనావళి నిత్యానుభవాలే ఈ సామెతల పుట్టుకకు దృష్టాంతాలుగా చెప్పుకోవచ్చు.

ప్రకటనలు

2 thoughts on “సామెతలూ, వాటి సంగతులు.

  1. “గాడిద గుడ్డూ..కంకర పీసూ…”వివరణ చాలా బాగుంది. అలాగే “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” కూడా అపభ్రంశమే అంటారు. “సొప్పు దెబ్బ కాస్తా చెప్పు దెబ్బ గా మారిందని. వివరించగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s