ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (6)

ఐదు

“ప్రేమ సుఖం కావాలన్నాడు, పుష్కలంగా ఇచ్చాను.  పుత్రుడు కావాలన్నాడు, అదీ ఇచ్చాను. అయినా పట్టుకుని వదలడు, ఇంకా ఉండిపోవాలంటాడు…ఎందుకలా?” అంది ఊర్వశి.
“నీది ప్రకృతి హృదయం, పురూరవుడిది పురుష హృదయం. దేనినీ పట్టించుకోవు నువ్వు. ఒకసారి పట్టించుకుంటే వదలనే వదలడతడు. ఈ నియమం ఇలా కొనసాగాల్సిందే!”
“ఎన్ని నియమాలు నేను రచించాను.  అన్నింటికీ సరేనన్నాడు పిచ్చివాడు.  అవన్నీ నేను ఎప్పటికైనా తప్పించుకు పోవడానికి తెరచి ఉంచుకున్న ద్వారాలని తెలుసుకోడు. ఈ పీడ నించి నేను తప్పించుకోగోరుతున్నానన్న తలపే రానివ్వడు…మూర్ఖుడు!”
“అంతగా దూషించకు ఊర్వశీ!” అన్నాడతడు అహం దెబ్బతిన్న మొహంపెట్టి.
“ఏం? మీ కెక్కడ బాధ కలుగుతోంది మహర్షీ?” అంది ఊర్వశి గాయాన్ని ఇంకొంచెం పెద్దది చెయ్యాలన్న తలపుతో అన్నట్లుగా.
“అతడు ప్రేమంటున్నాడు దానిని!”
“వాడి తలకాయ ప్రేమ. బంధించి తాళాలేసుకు చూసుకోవాలనుకోవడం ప్రేమెలాగవుతుంది?”
“ప్రేమకు అర్ధమేమిటి మరి?”
“నాకు అనుభవంలోకి వచ్చినపుడు చెబుతాను!”
“విడ్డూరంగా ఉంది. పురూరవుడితో ఇన్నేళ్ళ సహవాసంలో ప్రేమంటే ఏమిటో అనుభవానికి రాలేదా నీకు?” ప్రశ్నించాడతడు.
“వచ్చింది. చాలాసార్లు వచ్చింది. అలా వచ్చి వచ్చేగా నేనిక వెళతానన బయలుదేరిందీ?” అంది ఊర్వశి.
“ఆఁ…!”
“అందులో అంత విడ్డూరానికేముంది మహర్షీ? నేను ఊహా రూపను. బంధించబడడం నా నైజం కాదు.  అది నీకూ తెలుసు.  కానీ, పురూరవుడికి అది తెలిసేలా నువ్వు చెయ్యవ్.  చేస్తే కథ కంచికి చేరుతుందని నీ భయం.  పరమానందంలో నీ వంతు కొరవడుతుందని నీ ఏడుపు.  పురూరవుడి విచక్షణని ప్రేమనే వెర్రి మాయలో కప్పెట్టేశావ్.  పురూరవుడు ఇక కళ్ళు తెరిచి చూసే ప్రసక్తే లేదు.  ‘నువ్వే..నువ్వే!’ అని నన్ను తలుచుకుని తలుచుకుని ఏడుస్తూనే ఉంటాడు.  అతని శోకానికి అంతమే లేదు.  అదొక అనంతమైన మాయ…అంతులేని విలాపం…తనలోంచి తనే మళ్ళీ మళ్ళీ పుట్టుకుంటూ అనందిస్తూండే వింత రోగం!”

(అయిపోయింది).


ప్రకటనలు

4 thoughts on “ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (6)

  1. “వాడి తలకాయ ప్రేమ. బంధించి తాళాలేసుకు చూసుకోవాలనుకోవడం ప్రేమెలాగవుతుంది?”….superb!

    చాలా బాగా రాసారు! చలం పురూరవ గుర్తొచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s