మాకందాలు (4-7)

“ఊళ్ళోని జనంలో ముప్పాళ్ళు
ఏళ్ళుగా పారుతూన్న పాలేటి చలమల్లో
నీళ్ళను కడవల్లోనూ కావిళ్ళలోనూ
ఇళ్ళకు మోసుకెళ్ళే దృశ్యం నేడదృశ్యం వెంకట్‌బిరావూ!”

“మలమల మాడ్చే ఎండల్లోనూ
జలజల మని నీళ్ళు ఊరి కడవలు నింపేవే
చలమలు తలమునకలుగా
కలితీ లసలుకు కుదరని నీటి కుదురులవి వెంకట్‌బిరావూ!”

“కందులో అలసందలో
అందరమూ కలిసి చేలోంచి తుంచేసి దోరగా
కందేందుకు సౌక దుగ్గులో అగ్గేసి మగ్గేసి
విందుగా భోంచేసిన రోజులెంతో పసందైనవి వెంకట్‌బిరావూ!”

“సజ్జ నిప్పట్టెలంటే
బెజ్జంలేని తీపి గారెలలా ఉండేవే గానీ ఆ
వజ్జాన ముసురు పట్టేసిన రోజుల్లో
మజ్జారే తిండానికి తెగరుచిగా ఉండేవిగా వెంకట్‌బిరావూ!”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s