అమోహరాగిణి – నా వచన కవితలు (11)

“అమోహరాగిణి – ఒక అనంత పురూరవుడు”

పూర్వ పురుషునిలా
నీ మోహంలో ఇంకా పడుతూనే వున్నాను, వెలదీ!
రాజుకుంటున్న దేహంలో
రక్తం పరుగులు పెట్టే కొలదీ
వేదన… వేదన…వేదన!

విరామ రహిత నా విరహంలో అవిరామంగా
వసంతాల్నే కోసుకొచ్చి నీ ముంగిట వాల్చానో
హేమంతాల్నే మోసుకొచ్చి నీ ఎదపై వ్రేల్చానో
తరుణీ! తామసాంకితమైన నీ మనస్సు మేల్కాంచదు
ఏలనో…ఏలనో…ఏలనో!

నీ సౌందర్య హింసాజనిత తమోహ విషాదంలో
వలచి వలచి విలపించానో
తలచి తలచి విరహించానో
మౌనినీ! మానని గేయాన్నవుతున్నా నీ ఎద లయించదు
అదేలనో…ఏలనో…ఏలనో!


ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s