నా కంద పద్యాలు (8-11)

“నడచితి మెన్నో మారులు
అడుగడుగే వేసుకుంటు అలుపెరుగని పో
కడతో కడలికి అంచున
తడిగాలులలో తలపులతో సరదాగా!”

“వెన్నెలల రాత్రుల ఇసుక
తిన్నెలపై వాలి కనులు తెరిచే కన్నా
మెన్నెన్నో మంచి కలలు
అన్నిటినీ మరచి మురిసి అదియే పనిగా!”

“వేకువనే లేచి విధిగ
వాకిట తీర్చెదరు రంగవల్లికలు నమో
వాకములుగ అతివలు నీ
రాకకు సంకేతములుగ, రా…సంక్రాంతీ!”

“ఎచ్చటనున్నా వేప్పూ
పచ్చడిని ఉగాదినా డెపుడు తిను వాడూ
వెచ్చని కూరలు ఉన్నా
పచ్చడిపై తలపులు నిలుపు నతడు తెలుగౌ!”

(పై పద్యాల్లోని మొదటి, చివరి పద్యాల్లో యతి దోషాలు దొర్లాయి.  సవరణలకు, వివరణలకు చూడుడు ‘అభిప్రాయములు’)
ప్రకటనలు

10 thoughts on “నా కంద పద్యాలు (8-11)

 1. కంద పద్యాలు చాలా బాగున్నాయి. సంతోషం.
  కాని అక్కడక్కడ కొన్ని దోషాలున్నాయి.
  మొదటి పద్యం చివరి పాదంలో యతి తప్పింది. దానిని
  “తడిగాలుల తలపులతో సదా సరదాగా” అంటే సరిపోతుంది.
  చివరి పద్యం 2వ, 4వ పాదాలలో యతి తప్పింది.
  “పచ్చడిని ఉగాదినాడు భక్షణ చేస్తూ”
  “అచ్చడిపై తలపు నిలుపువాడే తెలుగౌ”
  అంటే సరిపోతుందని నా సలహా! తప్పులున్నాయని మిమ్మల్ని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదని మనవి.

  • శ్రీ శంకరయ్య గారికి,
   స్పందనకు ధన్యవాదములు!
   మొదటి పద్యం నాల్గవ పాదం ఉన్నది ఉన్నట్లుగా:
   ‘తడిగా'(స గణము), ‘లులలో'(స గణము), ‘తలపుల'(నలము), – కంద పద్యంలో 6, 14 గణములు జగణము గాని నలము గాని కావాలన్న నియమం ఉంది గాబట్టి – ‘తోసర'(భ గణము), ‘దాగా’ (గగ).
   పాద ప్రధమాక్ష్రం ‘త’ కు పాదం లోని నాల్గవ గణ ప్రధమాక్ష్రం ‘తో’ తో యతి సరిపోయినదని నేను భావించితిని.
   మీరు సూచించిన సవరణ ప్రకారం:
   ‘తడిగా’ (స గణము), ‘లులతల'(నలము), ‘పులతో'(స గణము), -ఇది 14వ గణము -, ‘సదాస'(జ గణము), ‘రదాగా'(లగగ).ఇందులో 14వ గణం (జగణము గాని నలము గాని కావాల్సి ఉండగా)సగణమవడం, 15వ గణం -బేసి గణం- జగణము కావడం, పాద ప్రధమాక్షరం ‘త’ కు చతుర్ధ గణ ప్రధమాక్షరం ‘స’తో యతి కుదరక పోవడం , చివరి గణం ఒక లఘువు ఎక్కువై ‘లగగ’ (కందానికి సరిపడని ఐదు మాత్రలగణము) కావడం దోషాలు అని నా భావన.
   కంద పద్యానికి యతి, గణ విభజన విషయంలో నేను అర్ధంచేసుకుని అనుసరిస్తూన్న విధానం ఇది.
   ఇందులో తప్పులున్నచో తప్పక తెలియ జేయగలరు.
   నాల్గవ పద్యంలో రెండవ, నాల్గవ పాదాల విషయంలో కూడా నేను అనుసరించిన విధానం ఇదే. మరొక్క సారి సరిచూసి తప్పులను తెలియ జేయగలరు.
   నమస్కారములతో,
   వెంకట రావు.

 2. అయ్యా,
  మళ్ళీ చిన్న సవరణ …..
  అది “తడి గాలుల తలపుతో సదా సరదాగా”
  నాల్గవ పద్యం రెండవ, నాల్గవ పాదాల సవరణలో నా సవరణలో దోషాలు లేవు.
  ఇక యతిమైత్రి విషయంలో కొంత వివరణ ………….
  మొదటి పద్యంలో “త-తో”లకు, నాల్గవ పద్యంలో రెండు చోట్లా “ప-పు”లకు యతిమైత్రి కూర్చారు. అది తప్పు.
  హల్లులతో పాటు వాటితో కూడిన అచ్చులకూ యతి మైత్రి పాటించాలి.
  పాదం ప్రథమాక్షరం “త” ఉన్నప్పుడు యతిస్థానంలో “త-తా-తై-తౌ”లు కాని అవే అచ్చులతో కూడిన “థ-ద-ధ” హల్లులు కాని ఉండాలి.
  అదే విధంగా “ప”కు “ప-పా-పై-పౌ” లేదా అవే అచ్చులతో కూడిన “ఫ-బ-భ-వ” హల్లులుండాలి.
  కంద పద్యాన్ని సలక్షణంగా వ్రాసిన మీకు ఈ యతిమైత్రి నియమాలు తెలియవని అనుకోను. “ప్రమాదో ధీమతామపి”!

  • ధన్యవాదములు శంకరయ్య గారూ!
   యతి మైత్రి విషయంలో నాకింకా కొన్ని సంగతులు తెలియాల్సి ఉందని అర్ధమౌతోంది.
   పోతే…ఇంకొక సందేహం. నాల్గవ పద్యం రెండవ పాదంలో మీరు సూచించిన సవరణలో ‘భక్షణ’ పదం చతుర్మాత్రా గణం అవుతుందా? వివరించగలరు.
   నమస్కారములతో,
   వెంకట రావు.

  • ధన్యవాదములు శంకరయ్య గారూ!
   ఒక విన్నపం. రెందు పద్యాల్లో పైన మీరు సూచించిన విధంగా సవరణలు ఇప్పుడు చెయ్యడం లేదు. కంద పద్య రచనలో నేను
   చేసిన తప్పులకు మీరు సూచించిన సవరణలు తెలిసేటందుకుగా క్రింద ఒక సూచన చేసి విడుస్తున్నాను. మన్నించ గలరు.
   నమస్కారములతో,
   వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s