వలయం – నా వచన కవితలు (12)

వలయం

జ్ఞాపకాల పుటల్లో నర్మంగా వర్తించే యవ్వనపు పురా సంగతులూ…
అనాది వలయంలోకి వెళ్ళిపోయి
అప్పుడప్పుడూ మాత్రమే ఆహ్లాదంలోకి అడుగుపెట్టే
ఒకప్పటి ఆశలూ, ఆశయాలూ…

ఎన్నినాళ్ళుగా ఇదిలా పునరావృతం అవుతూ ఉంటుంది?
వలయానికి ఆదీ అంతమూ ఉండకపోవడంలోనే
ఒక మిధ్యా, ఒక విలయమూ దాక్కుని ఉందా?

నేను నేనుగా జీవించిన క్షణాలూ
రహదారివెంట పటాలుగా వేళ్ళాడదీసిన
ప్రేమావేశపు సన్నివేశాలూ
నావిగానట్లుగా ఇప్పుడు కనిపించడం
అలాంటిదే ఒక మిద్య, ఒక విలయమూనా?

కంటికి స్వప్నం మిత్రుడై కరుణించినప్పుడల్లా
క్షిణికంగానైనా ఒక సన్నివేశం
వరుణాకృతి దాల్చడమూ
నీరదమై గర్జించి వర్షించడమూ
ఒక ఆనవాలుగా మిగిలన ఆకృతిలో
అలవటైన శోకాన్ని భరిస్తూ ఈ నేనెవరు?
అలవాటవని మోహాన్ని సహిస్తూ ఆ నీవెవరు?

ప్రకటనలు

2 thoughts on “వలయం – నా వచన కవితలు (12)

 1. శ్రీ వెంకట్రావు గారికి, నమస్కారములు.
  మీ ఈ కవితా అద్భుతంగా వున్నది అంటే అతిశయోక్తి కాదోమో!! అంగీకరించండి.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • శ్రీ మాధవ రావు గారికి,
   ధన్యవాదములు.
   మీరు అంగీకరించమన్న తరువాత, అంగీకరించకుండా ఎలా ఉండగలను? వినమ్రతతో అంగీకరిస్తున్నాను.
   నమస్కారములతో,
   వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s