సామెతలూ, వాటి సంగతులు(2)

నగవు

ఆస్తులు పోగొట్టించిందొక నగవు
నిండు సభలో వలువలు ఒలిపించిందదే నగవు
ఆపై అడవుల పాల్జేసిందీ అదే నగవు…

దోసిట నెత్తురు తర్పణపట్టించుకొందొక నగవు
ఆపై తరుణి తలవెంట్రుకలకు పూయించిందీ అదే నగవు…

తొడ కొట్టించిందొక నగవు
ఆపై తొడలు విరగకొట్టించించుకుందీ అదే నగవు…

రాజసూయావసరాన తలతీయించుకుందొక సుదీర్ఘ నగవు
తలనూ మీసాలనూ అర్ధభాగం గొరిగింపించుకుందింకొక అనర్ధావేశపు నగవు…

భూభవను నిలిచునున్న నేలతోసహా
పెకలింపించి అకాశమార్గాన లంక చేర్చిందొక అనౌచిత్యకార్యపు నగవు…

తోకకు నిప్పంటింపించుకొందొక తృణీకారపు నగవు
ఆపై ఆ తోకనే అంత లంకనూ తగులబెట్టింపించుకొందొక అహంభావపు నగవు…

నగవులేగా తొలినించీ తగవులన్నిటినీ తెగనివ్వని తప్పిదాలు
ఆవంకనేగా మరింకొకటి రెండు జతచేసి
‘నవ్వు నాలుగు విధాల చేట’న్న నానుడి చేశారు పెద్దలు!

ప్రకటనలు

2 thoughts on “సామెతలూ, వాటి సంగతులు(2)

 1. “నగవులేగా తొలినించీ తగవులన్నిటినీ తెగనివ్వని తప్పిదాలు”…..వాస్తవాల మల్లెల సౌరభాల చిరునగవులు చిందిస్తోంది మీ కవిత.కాని… నగు వది ఆరోగ్య హేతువని నుడివిరి పెద్దలెందరో….. అభినందనలు వెంకట్రావు గారు

  • ధన్యవాదములు రాఘవేంద్రరావు గారూ!
   @ నగు వది ఆర్యోగ్య హేతువని….అదీ నిజమే! కానీ ఆ నగవుకీ ఈ నగవుకీ తేడా ఉందనుకుంటాను!
   నమస్కారములతో,
   వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s