బాల్యం – బడి : నా వచన కవితలు (13)

బాల్యం – బడి (1)

ఆ దినములు బహుధా ఆహ్లాదకరములు
రోదనముల కసలుకు తావీయనివౌ
మోదకములు మదికింపౌ చేష్టలకు
సాధకములు సరసోల్లాసకములు, వింటే!

చెట్టులే ఎక్కామో గట్లెంటే తిరిగామో
ఎట్లాగైనా గాని ఒక్క పండునైనా
తెగ్గొట్టాలని ఎన్నెన్ని రాళ్ళతో కొట్టామో
ఎట్టెట్లని చెప్పగలము చిన్నప్పటి మాటల్!

వీధులలో అదేపనిగ తిరగడమూ ఎన్నో
విధాల వాదనలతో రోజంతా గడపడమూ
విధిగా ఒకటిరెండు సార్లన్నా పొట్లాడుకోవడమూ
సంధి కుదిరి సారీ చెప్పడమూ సామాన్య క్రియల్!

వేసివి రోజులలో వేడిమి తీరుటకై
వేసితిమెన్నో మారులు వెన్నెల పడకలు
ఇసుక తిన్నెలపై, రాత్రంతా ఏమాత్రం
భీతంటూ లేక, భలే ఉల్లాసముగాన్!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s