తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (1)

‘తోచు’ అనే పదానికి అగుపడు అని అర్ధం (ఉండినది ఒకప్పుడు.  అద్దమున తోచు ప్రతిబింబము పగిది, ఇత్యాదిగా). దారి తోచడం లేదు అంటే ఏ దారీ అగుపడదం లేదిని అర్ధం. కానీ ఇప్పుడు ఈ ‘తోచు’ అనే పదం ‘స్పురించు’ అన్న అర్ధంలోనే వాడ బడుతోంది.  ‘ఏమోయ్, ఏమైనా తోచిందా?’ అంటే ఆలోచనకు ఏమైనా స్పురించిందా అన్న అర్ధంలో వాడబడుతోంది.

విడియ, విడియము అనే మాటలకు అర్ధం తాంబూలము అని.  విడియమును అందుకున్న వారు, తాంబూలములను ఇచ్చి పుచ్చుకున్న వారు కాబట్టి ఒకరికొకరు విడియాల వారు అయారు.  అదే వియ్యాల వారుగా మారి ఉంది.

 

అన్ను అనే పదానికి అర్ధం స్త్రీ అని.  అన్నుల మిన్న అనే పదానికి తోటి స్తీలలో అందరి కంటె అందగత్తె అని అర్ధం.

అలరులు అంటే పూవులు అని అర్ధం.  అలరులు కురియగ ఆడెనదె – పూవులు రాలతాయి, కానీ ఇందులో పూవులను కురిపించడం జరిగింది.

గరుత్తు అన్న పదానికి రెక్క అని అర్ధం.  అవి కలవాడు గాబట్టి గరుత్మంతుడు.

ఐదువ అన్న పదానికి (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు మరియు చెవ్వాకు లేదా చెవియాకు) అను అయిదు అలంకారములు గల స్త్రీ అని అర్ధం.  ముత్త అనే పదానికి వృధ్ధ అని అర్ధం.  ముత్తైదువ – ముత్త ఐదువ.

‘తెన్’ శబ్దం దిగర్ధమున్న ద్రవిడ పదాంశం.  దక్షిణ దిగ్వాచి అంటే దక్షిణ దిక్కును సూచించే శబ్దం.  అయితే, తెలుగు భాషలో ఈ శబ్దం ఇప్పటి వ్యవహారం నుంచి తొలిగి పోయింది.  కానీ, తెమ్మెర, తెన్నేరు, తెంకాయ (టెంకాయ), తీరూ తెన్నూ – ఇత్యాది సమాస రూపాల్లో మాత్రం నిలిచి ఉంది.

ప్రకటనలు

6 thoughts on “తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (1)

  1. చాలా బాగా వ్రాశారు. అలర్ అంటే పువ్వనే కాక తామర పూవనే ఒక విశేషార్థం కూడా ఉంది. అలర్‍మేల్‍ మంగై అంటే పద్మాసనాశీనురాలైన లక్ష్మి అని అర్థం (తమిళంలో). అది ప్రజలనోట అలమేలు మంగ గా మారింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s