శ్రీ కృష్ణదేవరాయలు (1)

ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలను బట్టి, విజయ నామ సంవత్సర మాఘ బహుళ అష్టమి గురువారం నాటికి సరియైన క్రీ.శ.1474 పిబ్రవరి నెల 10వ తారీకు నాడు జ్యెష్ఠా నక్షత్రంలో శ్రీ కృష్ణదేవరాయల జననమయ్యిందని చరిత్రకారులు నిర్ణయించారు. తండ్రి నరస నాయకుడు, తుళువ వంశ క్షత్రియుడు.  తల్లి నాగాంబ.  ఈమె నరస నాయకునికి రెండవ భార్య.  నరస నాయకునికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య తిప్పాజి. మూడవ భార్య ఓబాంబ. మొదటి భార్య తిప్పాజికి జన్మించిన వీర నరసింహ రాయలు, మూడవ భార్య ఓబాంబకు జన్మించిన అచ్యుతదేవ రాయలు, రంగ రాయలూ, కృష్ణ దేవరాయల అన్నదమ్ములు.

కృష్ణదేవరాయల జననాన్ని గురించి, బాల్యాన్ని గురించి పారంపర్యంగా లోకులు చెప్పుకునే కథ – ఒకనాటి రాత్రి రాయల తండ్రి యైన నరసనాయకుని ఉదక పాత్ర (నీళ్ళ గ్లాసు) లో ఒక నక్షత్రం రాలి పడడం, ఆ నీటిని అతడు తిమ్మరుసు సలహాపై తాగడం, ఆ వెనుక రాయల జననం, రాయలంటే నరసనాయకునికి చాలా అభిమానం ఉండడం, ఇతర రాణులు దీనిని సహించ లేక రాయలను చంపించే ప్రయత్నాలు చేయడం, ఇది గ్రహించిన నరసనాయకుడు అతని క్షేమం దృష్ట్యా రాయలను పెంచి పెద్ద చేసే బాధ్యతను అప్పాజీకి అప్పగించడం అనేది ప్రసిధ్ధమై ఉంది. ఈ కథకు ఆదరువుగా ఉన్న చాటు పద్యం:

“అయ్య అనిపించు కొంటివి
నెయ్యంబున కృష్ణరాయ నృప పుంగవుచే
నయ్యా నీ సరి యేరీ
తియ్యని విలికాడ వయ్యా, తిమ్మరుసయ్యా!”

బాల్యంలో రాయలు అప్పాజీ దగ్గర ఏమేమి విద్యలు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి కూడా కథల సాక్ష్యమే గాని, గ్రంథ ప్రామాణ్యం కనుపించదు.  అయితే, రాయలు చిన్నతనం నుండి కూడా సరసుడూ, సాత్వికుడూ అయి ఉండి పెద్దల సద్గోష్ఠులలో కాలము గడుపుతూ ఉండే వాడనటానికి సాక్ష్యాలు ఉన్నాయని చెబుతారు. మాధ్వ గురువర్యులైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పూర్వులలో ఒకరైన కృష్ణాచార్యుల దగ్గర రాయలు వీణ వాయించడం నేర్చుకున్నాడనీ, రాయలు బాల్యంలో కత్తి సాములోనూ, ఇతర యుధ్ధ విద్యలలోనూ మాత్రమే కాక సంగీత సాహిత్యాది లలిత కళలలో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవడంలో అధికాసక్తి చూపేవాడని తెలుస్తుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s