శ్రీ కృష్ణదేవరాయలు (2)

క్రీ.శ.1509 జులై 22వ తారీకు దాకా శ్రీ కృష్ణదేవరాయల అన్న యైన వీర నరసింహరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడని చెప్పడానికి తగిన చారిత్రక అధారాలు ఉన్నాయని చెబుతారు. వీర నరసింహరాయల అభివృధ్ధిలో కృష్ణరాయల పాత్ర అన్నకు యుధ్ధాదికములలో సహాయపడడమనే రూపంలో ఉండినదనీ, వీర నరసింహరాయలు వృధ్ధుడై మరణించడం జరగలేదని, అతని మరణం అకస్మాత్తు సంఘటనగానే కనబడుతుందనీ చెబుతారు.

రాయల స్వభావానికి, రాయలు తానెప్పటికైనా రాజునవుతానని అనుకున్నాడో లేదో ఊహించడం కష్టము గాని, రాయల అన్నయైన వీర నరసింహరాయల హటాన్మరణం, విజయనగరపు రాజకీయ పరిస్థితులలో ఊహించని మార్పు తెచ్చి పెట్టిందన్నది నిజం.  దీనికి సంబంధించిన లోకప్రసిధ్ధమైన కథ – అవసాన దశలో వీర నరసింహరాయలు తన కుమారుని రాజుగా చేయ గోరి, సవతి తమ్ముడైన కృష్ణరాయని కళ్ళు పెరికించి తెచ్చి తనకు చూపమని తిమ్మరుసును ఆజ్ఞాపించడం, యుక్తిగా తిమ్మరుసు కృష్ణరాయని బంధించి గుర్రపుసాలలో దాచి ఉంచి,  మేక కళ్ళను పెరికించి తీసుకెళ్ళి చూపడం, అది చూసి నమ్మిన వీర నరసింహరాయలు తన కుమారుడు రాజు అవడానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని తలపోసి తృప్తిగా స్వర్గస్తు డవడం అనేది బహుళ ప్రచారం పొంది ఉంది.

అయితే, గుర్రపుసాలలో బంధీకృతుని చేసిన తరువాత కృష్ణరాయనికి తిమ్మరుసు జరిగిన సంగతి తెలుపగా, కృష్ణరాయలు అన్న యైన వీర నరసింహరాయాల నుండి ఇలాంటిది తానూహించ లేదనీ, తనకు రాజ్య కాంక్ష లేదనీ, రాజుగా ఎవరున్నా ఒక సైనికుడిగా తాను చేయగలిగిన సహాయంచేస్తూ ఒక సామాన్య జీవితం గడపడమే తనకు ఇష్టమైనదని అన్నాడనీ లోక ప్రచారమై ఉన్న కథలో భాగంగానూ, ఇంకా న్యూనిజ్ వ్రాతలలోనూ ఉంది.

ఏదేమైనా, తిమ్మరుసు అభీష్టం మేరకు, కృష్ణదేవరాయలు క్రీ.శ.1509 జులై 22 తరువాత పక్షం రోజులకు వచ్చు చుండిన శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు, అనగా క్రీ.శ.1509 ఆగస్టు 7వ తేదీ, మంగళవారము నాడు విజయనగర రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైనాడు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s