వివిధాలు (1)

చతుర్విధ కవిత్వము లంటారు. అంటే (1) ఆశు (2) బంధ (3) చిత్ర, మరియు (4) గర్భ కవిత్వములని కొందరూ, కొందరేమో (1) ఆశు (2) మధుర (3) చిత్ర, మరియు (4) విస్తర కవిత్వములనీ చెప్పారు. విస్తర కవిత్వమంటే ప్రబంధ కవిత్వమని కొందరి అభిప్రాయం. పింగళి సూరన కళాపూర్ణోదయంలో ‘విస్తార’ అని అన్నాడు. ‘విస్తర’ నో లేక ‘విస్తార’ నో, ఏదైనా అది ప్రబంధ కవిత్వమని ఎట్లా చెప్పగలం?

*****

“యేషాం కావ్యాను శీలన వశా
ద్విశదీభూతే మనో మంకురే వర్ణనీయ
తన్మయ యోగ్యతాస్యాత్; తే హృదయ
సంవాదభాజః సహృదయాః”

…..అని పెద్దల సూక్తి. అంటే “బహువిధములైన కావ్యములను పరిశీలించుటచే మనస్సనెడి అద్దము నిర్మలము కాగా, కవిగానో, గాయకునిగానో తాను మారిపోయి వారి హృధయముతో సమానమగు హృదయము కలవాడు సహృదయుడు” అని అర్ధం.

*****

14వ శతాబ్ది వాడైన మడికి సింగన రాజనీతి దృష్టితో తనకు ముందు, తన కాలంలోనూ ఉన్న నీతి శాస్త్ర గ్రంధాలలోని విషయాలను సేకరించి “సకల నీతి సమ్మతము” అనే నీతి గ్రంధాన్ని కూర్చాడు. తెలుగులో సంచిత కృతులలో మడికి సింగనదే మొదటిడి. రెండవది “ప్రభంద రత్నాకరం”. దీనిని పెద్దపాటి జగన్నాధకవి కూర్చాడు.  దీని సమకాలిక మైనదే సంచిత కృతి మరొకటి కూడా లభించింది.  ఈ రెండింటినీ చేర్చి పూజ్యులు స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు “ప్రభంద రత్నావళి” అనే పేర ప్రకటించారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s