సౌందర్యతత్త్వం – కళ (1)

కణాదుడు, గౌతముడు, శంకరుడు, అభినవగుప్తపాదుడు, ఆనందవర్ధనుడు – వీరు మహా విజ్ఞాన సంపన్నులు. వీరి రచనలను సంపాదించి చదివితే గాని భారతీయ సౌందర్య తత్త్వం పూర్తిగా అవగతం కాదని పెద్దలు చెబుతారు.

భారతీయ సౌందర్య తత్త్వ చర్చలోని ఒక విలక్షణ విషయము ‘రసము’.  ‘సరతి ఇతి రసః’ అని శాస్త్రోక్తి.  అనగా ప్రవహించునది అని అర్ధము. సమానార్ధక ఆంగ్ల పదము aesthetic experience. రసమెన్నడూ వాచ్యము కారాదనీ, వ్యంగ్యమే కావలెననీ భారతీయుల మతం.

‘రసము’ అనే పదాన్ని ‘భావము’ తో పోల్చ కూడదు అని చెబుతారు.  ‘భవతి ఇతి భావః’ – ఏది అగుచు నుండునో అది భావము.  భావము ఆవేశమే గాని రసము కాదు.  ఆవేశము ఉన్నంతవరకు రసానుభూతి కలుగదనీ, రసము భావము కాదనీ, భావమును జ్ఞప్తికి తెచ్చుకొనుట రసము కాగలదనీ సౌందర్య తత్త్వ చర్చలో సారాంశంగా తెలుస్తుంది.

బుధ్ధి అలోచనను జనింప జేయగా, హృదయము అనుభూతిని జనింప జేస్తంది.  శాస్త్రం ఏదయినప్పటికీ అది బుధ్ధి జనితం.  దీనికి వ్యతిరేకంగా, కళ ఏదైనప్పటికీ అది హృదయ జనితం. ఆలోచనతో శాస్త్రము,  అనుభూతితో కళ ఉత్పన్న మవుతాయి.  సత్యానుసంధానము చేయునది శాస్త్రము. సౌందర్యోపాసనము చేయునది కళ.

కళ అనేది ప్రధానంగా అభివ్యక్తి (expression) అని మొట్ట మొదటగా నిర్వచించినది గ్రీకు అలంకారికులని పెద్దలు చెబుతారు. అభివ్యక్తి అనగా ‘వెల్లడించుట’ అని అర్ధం.  అందు వలన ఏది వెల్లడింపబడక దాగి ఉంటుందో దానిని వెల్లడించుట అభివ్యక్తి అవుతుంది.  శిలలో దాగి ఉండిన రూపమును,  రంగులో దాగి ఉండిన దృశ్యమును,  వాక్కులో దాగి ఉండిన కవితను,  శబ్దమున దాగి ఉండిన సంగీతమును వెల్లడించడంలో ద్యోతక మగునది అభివ్యక్తియే. అందు వలన కళ అనేది అభివ్యక్తియే తప్ప వేరుకాదు అనేది సిధ్ధాంతమైంది.

ఉత్తమ కళకు మంచి చెడులతో సంబంధం లేదనీ, నీతిని బోధించడం కళ పని కాదనీ, శుధ్ధ రసానందం కలిగించడమే కళ నెర వేర్చవలసిన పని అనీ ఒక వాదం ఉంది. ఇది రసవాదం అనబడుతుంది. ఈ వాదము చేత నిర్వచిత మయ్యే కళకు ‘శుధ్ధ కళ’ అని పేరు.  దీనికి వ్యతిరేకమైనది ‘నైతిక కళ’.  కళ అనేది కేవల రసానందం కలిగించినంత మాత్రాన సరిపోదనీ,  దానికి తోడు ఒక నైతిక సందేశాన్ని కూడా అందించాలనీ, అప్పుడు మాత్రమే అది ఉత్తమ కళ అవుతుందనీ నైతిక కళా వాదులు చెబుతారు.

ప్రకటనలు

2 thoughts on “సౌందర్యతత్త్వం – కళ (1)

  1. శ్రీ వెంకట్ బి. రావు గారికి, నమస్కారములు.

    చక్కటి వ్యాసాన్ని అందించారు. ఒక వీణావాదాన్ని వింటున్నప్పుడు, బుద్ధి ద్వారా ఒక పాటను వింటున్నాము అని తెలుసుకుంటాము. ఆ పాట, ఏ భాషలోవున్నా, మనకు అర్ధాంకాకపోయినా, వీణావాదంలో వున్న మాధుర్య రసం మన హృదయాన్ని తాకితే, మనం రసమయులవుతాము.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s