సౌందర్యతత్త్వం – కళ (2)

భారతీయ శిల్ప కళ  రెండు అద్భుతమైన శిల్ప కళాకృతులను ప్రపంచానికి ప్రసాదించిందని పెద్దలు  చెబుతారు. అందులో మొదటిది, ‘నిర్వాత నిష్కంప ఇవ ప్రదీపం’ అంటే ‘గాలి విసరని చోటున ఉన్న చలించని దీప శిఖ’ ను పోలిన ‘ధ్యాన బుధ్ధ’ విగ్రహం. రెండవది, నటరాజ మూర్తి.  ధ్యాన బుధ్ధ మూర్తి ప్రశాంత స్థితి భావానికి ప్రతీక. నటరాజ మూర్తి గతిశీలతకు ప్రతీక. ధ్యాన బుధ్ధ మూర్తిని ఉత్తర భారతం అందిస్తే, నటరాజ మూర్తిని దక్షిణ భారతం అందించిందని చెబుతారు.

ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపించే ఈ రెండు స్థితులలో మొదటిది తనను తాను తెలుసుకోవడానికి, రెండవది తనను ప్రపంచానికి తెలియజేయడానికి ఉపకరిస్తాయనీ, ఈ రెండు స్థితులూ ఏ వ్యక్తిలో సమపాళ్ళలో సమ్మిళితమై ఉంటాయో ఆ వ్యక్తి పరిపూర్ణ మానవుడు కాగలుగుతాడనీ నా మనసుకు తోచిన వ్యాఖ్య.

అలాగే, సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించే ప్రక్రియలో నన్నయ కవితా రీతి  పై వాటిలో మొదటి రకానికి చెందుతుందని, తిక్కన రీతి రెండవ రకానికి చెందుతుందని కూడా నాకు అలవిపడినంతమేర పరిశీలనలో నా పరిమిత బుధ్ధికి తోచిన సంగతి.

“నాల్పే సుఖ మస్తి, భూమైవ సుఖం, యావై భూమా
తదమృతం, అథ యదల్పం తన్మర్త్యం ”

…అని ఋషి వాక్కు. ‘పరిమితమున సుఖము లేదు, అపరిమితమే సుఖము. ఏది అపరిమితమో అది అమృతము, ఏది పరిమితమో అది మృతము’ అని ఆ మాటల అర్ధం. స్థూలంగా ఇది భారతీయుల కళా దృష్టి కి నిర్వచనంగా చెప్పుకోవచ్చు.  ధ్యాన బుధ్ధ, నటరాజ మూర్తులలో గోచరించేది ఈ అమృతత్వమే అని నా భావన. ఈ భావాన్నేఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి మొత్తం సారాన్ని ఇంకా తక్కువ మాటల్లోకి కుదించ వచ్చేమోనని ప్రయత్నించగా, చివరికి నాలుగంటే నాలుగు మాటల్లోకి చేర్చి చెప్పొచ్చనిపించి, నా ‘ఊర్వశి, పూరూరవ’ వ్యాసానికి ప్రస్తావనలో చివరన తేలికైన మాటల్లో ఇలా చెప్పాను:

“సుఖం ఫులుస్టాపు.
దుఃఖం కామా….”

ఈ సందర్భంలో ఇందులోని దుఃఖాన్ని పరిమితార్ధంలో కాకుండా, తత్త్వ చింతనలో బుధ్ధుడు ప్రతిపాదించిన ‘దుఃఖం’, ప్రపంచంలో ప్రతిదీ వైరుధ్యాలతో కూడుకుని కనిపిస్తుంది, ఈ వైరుధ్య ఫలితమే ‘దుఃఖం’, అన్న అర్ధంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతంలేని ఈ దుఃఖం నుంచే అజరామరమైన ఎన్నో కళా కృతులు పుట్టాయి, పుడుతున్నాయి అని నేను నమ్ముతాను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s