వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (2)

నానుడులు, లోకోక్తులు అనదగినటువంటివి, అర్ధం అదే అయినా ఇప్పుడు వేరే మాటలలో ప్రయోగంలో ఉన్నటువంటివి, కొన్నైతే అసలు ప్రయోగంలో లేనటువంటివి, మరికొన్ని వేంకటకవి స్వయంగా సందర్భానికి అతికేట్లుగా కల్పించినట్లు అనిపించేటువంటివి, వేణుగోపాల శతకంలో చాలా కనిపిస్తాయి.  వాటిల్లో కొన్నిటిని క్రింద చూపడ మైంది:

‘వెన్న యుండియు నేతికి వెదికి నటుల’ – ఇంటిలో వెన్న సమృధ్ధిగా ఉన్న సంగతి మరిచి నేతికోసం ప్రయాస పడినట్లుగా అని ఈ మాటల అర్ధం. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత, ఒడిలో బిడ్డను పెట్టుకుని ఇల్లాంతా వెదకడ మన్న సామెతా దీనికి కాస్తంత దగ్గరగా అనిపిస్తాయి తప్ప పూర్తిగా ఈ మాటల అర్ధంతో సరిపోగల సామెత ఇప్పుడు వ్యవహారంలో ఒక్కటి కూడా లేదని నా కనిపిస్తుంది.

‘కల్ల పసిండికి కాంతి మెండు’ – మెరిసేదంతా బంగారం కాదు (all that glitters is not gold అన్న ఆంగ్ల సామెతకు మక్కికి మక్కి) ఇప్పుడు వ్యవహారంలో ఎక్కువుగా వినిపించే సామెత.  కాని అర్ధంలో సూక్ష్మమైన తేడా ఉంది. ‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది’ అన్న సామెత అర్ధానికి ఈ సామెత అర్ధానికి ఓమొస్తరుగా సామ్యం కుదురుతుంది. కానీ ఇందులో హేళణ ఎక్కువగా ధ్వనిస్తుంది. పై సామెతలో భావ గాంభీర్యం ఎక్కువ.

‘అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద’ ఇంత చక్కని నానుడి ఇప్పుడు ప్రయోగంలోనే లేదు. half knowledge is always dangerous అన్న ఆంగ్ల లోకోక్తిని గుర్తుంచు కున్నంతగా మనం ఈ సామెతను గుర్తుంచుకోలేదు. 

‘ఆబోతు పేదల యశము గోరు’ – ఇది అత్యంత హృద్యమైన నానుడి.  బసవయ్యను అంత ఎత్తులో, ఉన్నతమైన రూపంలో  లేపాక్షిలో మనవాళ్ళెందుకు మలుచుకుని స్థాపించుకున్నారో ఈ మాటల వల్ల అర్ధమవుతుంది.

‘గజముపై చౌడోలు గాడిద కెత్తితే, మోయునా పడవేశి కూయు గాని’ – చౌడోలు అంటే ఏనుగుపై  అంబారి. భారం మోయగలడో లేడో చూసి తలకెత్తాలి అనీ, సమర్ధత సరిగా గుర్తెరిగి కాని ఏపనినైనా అప్పగించ కూడదనీ ఈ మాటల అర్ధం. ఇదసలు ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘వలపు రూపెఱుగదు, నిద్ర సుఖం బెఱుగదు, ఆకలిలో నాల్క అఱుచి ఎరుగదు’ – ఇది ఒక నానుడుల మాలిక.  ఇందులో మొదటి దానికి సారూప్యత గలిగిన ‘ప్రెమ గుడ్డిది’ అనే ఇప్పుడు వాడుకలో ఉన్ననానుడి love is blind అనే ఆంగ్ల లోకోక్తి కి మక్కికి మక్కి.  దీనిని గుర్తుంచుకుని  వాడుతున్నాం మనం. నిద్ర సుఖ మెరుగదు అనే నానుడి అప్పటికి ఇప్పటికి అలాగే ప్రచారంలో ఉంది.  ఇక మూడవది ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న రూపంలో సంక్షిప్తమై ప్రయోగంలో ఉంది. ఆకలిలో నాల్క ‘అఱుచి’ ఎరుగదన్నదే హృద్యమైన అసలు రూపం.

ప్రకటనలు

10 thoughts on “వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (2)

   • YS Subramanyam గారూ!
    ధన్యవాదాలు! తమ వంటి పెద్దల salutations ని ఆశీర్వచనాలుగా తీసుకుని ముందుకు వెళ్ళడమే నేను చేయవలసిన పని అనుకుంటాను!
    వినమ్రంగా, మీ వ్యాఖ్యలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  • ధన్యవాదాలు శర్మ గారూ! కొన్ని పొస్టులు రాసి post చేసేటప్పుడు అసలివి ఎవరన్నా చదువుతారా? అన్న సందేహం మనసులో వుండేది. అయినా post చేశాను. పోస్టు చేసిన ఇన్ని రోజుల తరువాత వ్యాఖ్య రావడం బాగుంది!

   మరోసారి ధన్యవాదాలు!

 1. వెంకట్ గారు,
  నిన్న యిక్కడ వొక చిన్న తమాషా జరిగింది. యీటపా వున్న పేజీ కనపడింది, ముందు సుబ్రహ్మణ్యం గారు చదివారు, కామెంటు రాశారు……వ్యవహారమ్ కదండి, బాగుంది, వెనకనే రాసేసా.దీని వల్ల అర్ధమయ్యేదేమంటే, పాత వాటిలో మంచివి చూసి మళ్ళీ ప్రచురించడం. కారణం మనం అప్పటికి యెక్కువ మందికి తెలియక పోవడం చేత,చదవలేదు కనక. పొరపాటు కూడా మంచి పని చేయించిందికదా.
  ధన్యవాదాలు.

   • YS Subramanyam గారూ!
    ధన్యవాదాలు! తమ వంటి పెద్దలు చదివి అభినందించడం కంటె, నా వ్రాతలకు వేరే సాఫల్యం లేదనుకుంటాను.
    మీ వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలు!

  • ధన్యవాదాలు శర్మ గారూ!
   ఎలా జరిగితేనేం, మీరు చదివి అభినందించారు! నాకు అంతకంటే కావలసింది వేరు లేదు!
   మరోసారి ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s