వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (1)

తెలుగు శతక వాఙ్మయంలోని అధిక్షేప శతకాలలో పోలిపెద్ది వేంకటరాయకవి రచించిన వేణుగోపాల శతకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్వేటి నగర సంస్థాన కవులలో ఇతడు ప్రముఖుడు. రాజాశ్రయంలో జీవనాన్ని గడిపినప్పిటికీ, అలా గడపాల్సి రావడంలోని సాధక బాధకాల్ని అనుభవపూర్వకంగా ఎఱిగిన వాడవడంవలన అవకాశం దొరికినప్పుడల్లా నిరసించి స్వతంత్ర దృక్పథాన్ని చాటుకుంటూనే జీవితాన్ని గడిపినట్లుగా కనిపిస్తాడు. రాజాశ్రయం ప్రమాదకరమైనదని చెప్పే ఇతని అధిక్షేప పద్యాల్లోని భావాల గాఢత ఈ అభిప్రాయానికి బాసటగా నిలిస్తుంది.

పోతన గారి దగ్గర్నుంచీ ఇల్లాంటి అధిక్షేపాలు మామూలే.  ఇందులో పెద్దగా విశేషమేమీ లేదు గాని, వేంకటరాయకవి వేణుగోపాల శతకంలో, రాజాశ్రయానికి సంబంధించినవి, వేశ్యా సాంగత్యమూ ఇంకా ఇతరాలైన దుర్వ్యసనాలకు సంబంధించిన అధిక్షేపణ పద్యాలను పక్కన పెడితే, మిగిలిన కొన్ని పద్యాలలో ఇతడు వాడిన తెలుగు పలుకుబడులూ, తెలుగు మాటల ప్రయోగాలూ, సామెతలూ కొన్ని ఇప్పుడు వాడకంలో లేనివి, ఆసక్తికరమైనవి, అచ్చమైనవి కనిపిస్తాయి.

మొదటగా, ‘చెప్పు’ అన్న పదాన్ని (అంటే చెప్పడం అన్న అర్ధంలోని మాటను) ఆధునిక కవిత్వంలో లాగా ఇతడు ప్రయోగించిన విధం, ఈ క్రింది పద్యంలో:

“అవనీశ్వరుండు మందుడైన నర్ధుల కియ్యవద్దని యొద్ది దివాను చెప్పు
మునిషీ యొకడు చెప్పు మొనసి బక్షీ చెప్పు తరువాత నా మజుందారు చెప్పు
తలద్రిప్పుచును శిరస్తా చెప్పు వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు
దేశపాండ్యా తాను దినవలెనని చెప్పు మొసరద్ది చెవిలోన మొఱిగి చెప్పు

యశము గోరిన దొరకొడుకైన వాడు
ఇన్ని చెప్పులు కడద్రోసి యియ్యవలయు…”

ఇందులో ఇంతమంది ‘చెప్పడాలను’ అన్న భావాన్ని ఇంపుగానూ, నిందాగర్భితంగానూ, వ్యంగ్యంగానూ ‘ఇన్ని చెప్పులు’ గా చెప్పబడింది. ఆధునికత సంతరించుకున్న ఇలాంటి ప్రయోగాలు పూర్వ కవుల కవిత్వంలో చాల తక్కువగా కనిపిస్తాయి.

ఇలాంటిదే ఇంకొక విన సొంపైన ప్రయోగం ‘కల కొద్ది లోపల’ అన్నది.  ‘తన కున్నంతలో’ అన్న అర్ధంలో ఈ మాటల ప్రయోగం జరిగింది ఈ క్రింది పద్య పాదంలో:

“కల కొద్దిలోపల కరుణతో మన్నించి
ఇచ్చిన వారి దీవించ వలయు”

నోరుతెరిచి అడిగిన వారికి తనకున్నంతలోనే కాదనక ఇచ్చిన వారిని దీవించాలి అని ఈ పంక్తుల భావం.

ఈ మాట ఇలా ఇప్పుడు వాడకంలోనే లేదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s