కల : నా వచన కవితలు (17)

కల

విరి తల్పం లాంటి నీ చిరునవ్వుల ఒడిలో
చిక్కి సొక్కి ఉన్న కళ్ళతో మత్తెక్కి ఉన్న వేళ
తరుణివైన నీకు అరణపు కానుకలా
నన్ను నేను అర్పించుకో జూశాను అప్పుడెప్పుడో…

అది ఒక కల
వెన్నెలలో పరుగెత్తడం మరిచిపోయి నిలుచున్న జింకలా
హటాత్తుగా జారి పడ్డట్లున్న నక్షత్రాల్లాంటి కళ్ళతో
నా వైపు చూసిన నిన్ను
మొదటిసారి మోసుకొచ్చింది ఆ కల…

మూర్ఛిల్లడం పూర్తిగా గుర్తుంది
మౌనం దాల్చడం కాస్తకాస్తగా గుర్తుంది…

పయ్యెదను పానుపులా చేయడం పూర్తిగా గుర్తుంది
పలుకలేని భావాలకు పవ్వళింపులో పాటగా
ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాస్తకాస్తగా గుర్తుంది…

మాటేసి ఉన్న వేటగాడిలా మాటకు కాని నాపై
మోహం చెల్లడం పూర్తిగా గుర్తుంది
వేటుకు తెగిపడ్డ కముజు పిట్టలా
కల చెదరడం కాస్తకాస్తగా గుర్తుంది.

ప్రకటనలు

2 thoughts on “కల : నా వచన కవితలు (17)

  1. శ్రీ వింకట్ బి. రావ్ గారికి, నమస్కారములు.

    కవితా అద్భుతంగా వుంది. అందుకోండి అక్షరమాలలు. ఒక పదంలో ` చెల్లడం ‘ అని పడింది. బహుశా, అది చల్లడం అని వుండాలనుకుంటాను. పోతే, ఇంత అందమైన కలను మీరు `వేటుకు తెగిపడ్డ కముజు పిట్టలా కల చెదరడం కాస్తకాస్తగా గుర్తుంది.’ — అని ముగించటం అన్యాయంగా వుంది. తార్కికంగా ఆలోచిస్తేకూడా, కలను ఎప్పుడూ సాకారం చేయాలి. కనుక, నీరులాగా కల కరిగి, నిజరూపంలో మంచుముక్క అయింది అనే అర్ధ వచ్చేటట్లుగా ముగిస్తే బాగుండేది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • శ్రీ మాధవరావు గారికి, స్పందనకు ధన్యవాదములు.
      కవిత్వానికి సంబంధించినంతవరకూ, నిజం చెప్పాలంటే, ఒక ఊపు లో వ్రాస్తుంటాను. ఆ ఊపులో పదాలు వచ్చి
      పడుతూంటాయి. కొన్ని రోజుల తరబడి, ఒక్కోప్పుడు కొన్ని మాసాల తరబడి అటు వైపు ధ్యాస వెళ్ళదు. వెళ్ళి నప్పుడు మూడో, నాలుగో, అయిదో చేరిపోతుంటాయి. అక్కడక్కడా నడక కుదరని చోట్ల తప్ప పెద్దగా మార్చను. ఈ కవిత విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు మార్చాలన్నా అంత తెలికగా మార్చలేను. కవిత నచ్చి నందుకు ధన్యవాదములు.
      నమస్కారములతో,
      వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s