ఆంధ్రమూ, తెలుగూ…(1)

ఆంధ్రమూ, తెలుగూ…(1)

“దేశభాషలందు తెలుగు లెస్స!” అని ఎప్పటినుంచో (శ్రీనాధుని కాలం క్రీ.శ.13వ శతాబ్దం నుంచీ) వినిపిస్తున్న ప్రశంశ. అజంత భాష కావడంవల్ల వినడానికీ, అక్షరాలు గుండ్రంగా ఉండడంవల్ల చూడడానికి అందంగా ఉండే భాష తెలుగు.

తెలుగులో లిఖిత సాహిత్యం వెయ్యేండ్లది – ఇప్పటిదాకా లభ్యమైన తాళపత్ర గ్రంథాల వయసునూ, కాలనిర్ణయాన్నీ బట్టి.

ఈ వెయ్యేండ్ల తెలుగు సాహిత్యాన్నీ (తత్సంబంధ పరిశోధనా సాహిత్యాన్నీ) ఇతర భారతీయ భాషల (ముఖ్యంగా సంస్కృతం, ప్రాకృతం), ప్రపంచ భాషల (ముఖ్యంగా ఆంగ్లం) సాహిత్యంతో పోల్చుకుని చూసుకుని, దాని విలువను బేరీజు కట్టజూచిన నాలాంటి ఏ సామాన్య పాఠకుడికైనా, సాహిత్యాభిలాషికైనా, కొన్ని ముఖ్యమైన విషయాలు మనసుకు తడతై. అవి వరుసగా –

1. ఋగ్వేద కాలం నుంచీ ఆంధ్రుల ప్రసక్తి (జాతి పరంగా) కనిపిస్తుంది.  ఋగ్వేదానికి సంబంధించినదైన ఐతరేయ బ్రాహ్మణంలో శునశ్శేపుని కధ ఇందుకు ఆధారం అని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ శునశ్శేపుని కథలో, విశ్వామిత్రుడు తన ఆజ్ఞను ధిక్కరించిన తన యాభై మంది పుత్రులను వారి సంతతిని అనార్య జాతులైన ఆంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబ ఆది జాతులలో కలిసిపోయి ఆర్యావర్తానికి ఆవల జీవించండని శపించినట్లుగా పెద్దలు విశద పరిచి చెప్పిన మాటలు.

2. ఋగ్వేదంలో ఈ ప్రసక్తి ఆధారంగా ఆంధ్రులు ఒక ప్రత్యేకమైన అనార్య జాతిగా ఆర్యావర్తానికి ఆవల ప్రాంతాలలో ఆకాలంలో నివసిస్తూండేవారని చెప్పుకోవచ్చు.  మహాభారతంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. శ్రీకృష్ణుని చేతిలో హతుడైన చాణూరుడు ఆంధ్రుడు.

3. మనుస్మృతిలో ఆంధ్రులు కారావర కన్యకు వైదేహుని వలన పుట్టిన నిషాదులని చెప్పి ఉండడంవలన ఆంధ్రులు మిశ్రజాతీయులని ఒక ఊహ. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యమైందో తెలీదు.  ఐతే, ఇది ఆంధ్రులు జన్మతహా ఉత్తరాది వారని తెలియజేస్తున్నదని ఒక అభిప్రాయం.

4. ఆంధ్రుల భాష మొదట తెలుగు కాదు.

5. ఏకారణం చేతనో ఆంధ్రులు దక్షిణ భారతానికి తరలి వచ్చి తెలుగు భాష మాట్లాడే అక్కడి ప్రజలతో కలిసిపోయి తెలుగునే వారి భాషగా చేసుకుని తెలుగువారి ఆచార వ్యవహారాలను తమవిగానే చేసుకుని ఉండిపోయారని ఒక అభిప్రాయం ఉంది. ఇది నాకంత సమంజసమైనదిగా తోచదు.  ఒక జాతి తమను తాము అంతగా పోగొట్టుకుని వేరే జాతిలో లీనమై పోవడం అన్నది ఊహించడం అంత తేలిక కాదు.

6. భారత దేశ చరిత్రలో మౌర్యుల తరువాత అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశీయులైన శాతవాహనులు ఆంధ్ర భృత్యులని పిలవబడినారు.  వీరు ఆంధ్రులకు భృత్యులా, లేక వీరే ఆంధ్రభృత్యులా అన్నది ఇంకా తేలని విషయం. అయితే ఇది వీరు తెలుగువారు కాదనడానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. వారి అధికార భాష ప్రాకృతం. ప్రాకృతంలోనే వారి శాసనాలన్నీ ఉన్నాయి.  వారి సాహిత్యం కూడా ప్రాకృతంలోనే. శాతవాహనుల కాలంలో పైశాచీ ప్రాకృతంలో రచితమైన ‘బృహత్కథ’ కర్త గుణాఢ్యుడు ఆంధ్రుడని ప్రతీతి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s