ఆంధ్రమూ, తెలుగూ…(2)

ఆంధ్రమూ, తెలుగూ…(2)

7. ప్రాకృత కవి ఉద్యోతనుని ‘కువలయమాల’ కథలో ఆంధ్రుల లక్షణాలను తెలియజేశే రెండు ప్రాకృత పంక్తులున్నాయి. ఆ రెండు ప్రాకృత పంక్తులూ ఇవి –

“పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రోద్దే
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి.”

ఈ మాటల అర్ధాన్ని స్వర్గీయ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు (తమ ‘ప్రాకృత గ్రంధకర్తలూ, ప్రజా సేవానూ…’ అన్న సుదీర్ఘ ఉపన్యాసంలో) ఈక్రింది విధంగా విశద పరచి చెప్పారు:

“అందగత్తెలన్నా, అధవా యుధ్ధరంగమన్నానూ సమానంగా ప్రేమించేవాళ్ళున్నూ, అందమైన శరీరాలు గలవాళ్ళున్నూ, తిండిలో దిట్టలున్నూ అయిన ఆంధ్రులు అటూ, పుటూ (‘పెట్టూ’ కాబోలు) రటూ (‘రట్టూ’ ఏమో) అనుకుంటూ వస్తూండగా చూచాడు.”

ఈ ప్రాకృతకవి ఉద్యోతనుడు నివసించిన కాలం క్రీ.శ.892 ప్రాంతంగా స్వర్గీయ ఆరుద్ర గారు చెప్పారు (తమ సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటంలో).

8. నన్నయకు పూర్వం తెలుగులో లిఖిత సాహిత్యం లేదు, ఒక వేళ ఉండినా ఇప్పటికీ అలభ్యం.

9. నన్నయ ‘మహాభారతం’ అనువాదంతో తెలుగులో లిఖిత సాహిత్యం మొదలైంది. ఏ దుర్ముహూర్తాన(?) ఇది మొదలైందో గాని, ఆ తరువాత కొన్ని శతాబ్దాల పర్యంతం తెలుగులో అనువాదాలే రచనలయ్యాయి. దీనికి నన్నయను బాధ్యుని చెయ్యబూనడం అర్ధరహితం.

10. వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్రం’ తోనూ, రాయప్రోలు వారి భావ కవిత్వం పద్యాల తోనూ, ఆంగ్ల సాహిత్యాన్ని అనుకరిస్తూ తెలుగులో ఆధునిక సాహిత్యం మొదలైంది.

11. గడచిన వెయ్యేండ్లలో ‘క్రీడాభిరామం’, ‘కళాపూర్ణోదయం’, ‘కన్యాశుల్కం’ తప్ప తెలుగులో స్వతంత్ర రచనలు లేవు (నా ఉద్దేశ్యంలో).  ఎంతగా అసభ్య పదజాలంతోనూ, వర్ణనలతోనూ నిండి ఉన్నప్పటికీ, అనువాదంగా తప్ప వేరే విధంగా రచన చెయ్యడాన్ని ఊహించలేని తెలుగు లోకానికి, మనదైన వాతావరణాన్ని, నిజ జీవితాన్ని కళ్ళకు కట్టే విధంగా చూపించే ప్రయత్నం చేసింది మొదటగా ‘క్రీడాభిరామం’. వల్లభరాయుడు ఇచ్చిన ఈ ఆలోచనను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి సభ్య సమాజపు రోజువారీ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఒక్క రచన కూడా అప్పటి కవులలో ఏ ఒక్కరూ ఎందుకు చెయ్యలేకపోయారో నాకిప్పటికీ అర్ధంకాదు.  ‘కళాపూర్ణోదయం’ అచ్చమైన, అత్యంత హృద్యమైన కల్పన. ఇక ‘కన్యాశుల్కం’ గురించి ప్రత్యేకంగా చెప్పవలిసింది లేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s