తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -1

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -1

1) ఆంధ్ర మహా భారతం – లోక ప్రసిధ్ధం. 11వ శతాబ్దం పూర్వార్ధం. సంస్కృత మహాభారతానికి నన్నయ భట్టు తెలుగు (ఆంధ్ర) స్వేచ్చానువాదం. ఆంధ్ర శబ్ద చింతామణి అని సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా నన్నయ పెరుమీద ప్రచారంలో ఉంది.

2) గణిత సార సంగ్రహం (పావులూరి గణితము అని నామాంతరం) – పావులూరి మల్లన (11వ శతాబ్దం ఉత్తరార్ధం). వీరాచార్యుడను జైన మతగురువు సంస్కృతంలో రచించిన ఇదే పేరుగల గ్రంధానికి తెలుగు అనువాదం.  

3) కవిజనాశ్రయము – మల్లియ రేచన. తెలుగు భాషలో మొదటి ఛందో గ్రంథం. తెలుగులో ఛందస్సును బోధించే గ్రంథాల్లో ప్రామాణికమైనదిగా ప్రసిధ్ధి చెందిన గ్రంథం.  ఇతడు జైన మతస్థుడు. నన్నయకు పూర్వుడని కొందరు, తరువాతి వాడని కొందరు అంటారు.

4) కుమార సంభవం – నన్నెచోడ మహారాజు, 12వ శతాబ్దం. మహాకవి కాళిదాస రచిత సంస్కృత కుమార సంభవానికి తెలుగు స్వేచ్చానువాదం. టెంకణాదిత్యుడని కూడా వ్యవహృతుడు. ఇతనిదే కళావిలాసము అనే కృతి ఇప్పటికీ అలభ్యం.

5) మల్లికార్జున పండితారాధ్యులు (1120-1180). శివతత్త్వ సారము (అసంపూర్ణంగా, అంటే సుమారు వెయ్యి పద్యములు ఉండవలసి ఉండగా నాలుగు వందల యెనభై తొమ్మిది పద్యములతో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కృషి ఫలితంగా ప్రకటింపబడినది) ఈయనచే రచించబడిన లింగొద్భవ గద్య, రుద్ర మహిమ, గణ సహస్ర మాల, అమరేశ్వరాష్టకం ఇప్పటికీ అలభ్యం.

6) పాల్కురికి సోమనాధుడు (13వ శతాబ్దం ఉత్తరార్ధం) – పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, సోమనాధ స్థవం, అనుభవ సారము, చెన్న మల్లు సీసములు, వృషాధిప శతకము, బసవోదాహరణము. ఉదాహరణము అనే సాహిత్య ప్రక్రియకు ఈయనే ఆద్యుడు.

7) తిక్కన సోమయాజి (1210-1290). ఆంధ్ర మహాభారతం (ఆది, సభా, అరణ్య పర్వాలు తప్ప మిగతా పదిహేను పర్వాలు), నిర్వచనోత్తర రామాయణము.

8 ) దశకుమార చరితము – మూలఘటిక కేతన. ఈయన తిక్కన మహాకవికి సమకాలీకుడు. ఈయనవే విజ్ఞానేశ్వరీయము (ఆధ్యాత్మిక గ్రంథం), ఆంధ్ర భాషా భూషణము (వ్యాకరణ గ్రంథం).

9) మార్కండేయ పురాణం – మారన (తిక్కన సోమయాజి శిష్యడు). పురాణాల ఆంధ్రీకరణం ఈయనతోనే ప్రారంభం.

10) అధర్వణ కారికావళి (వికృతి వివేకము అని నామాంతరం) – సంస్కృత్రంలో రచింపబడిన తెలుగు వ్యాకరణ గ్రంథం. అధర్వణాచార్యుడు. తిక్కన సోమయాజి కాలం వాడే. ఇతనిదే త్రిలింగ శబ్ధానుశాసనం, చిన్న వ్యాకరణ గ్రంథం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s