తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -2

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -2

11. నీతిసార ముక్తావళి – బద్దె భూపాలుడు (క్రీ.శ.1260 ప్రాంతం), నీతి పద్యములు.  సుప్రసిద్దమైన సుమతీ శతకాన్ని ఇతడు రచించినట్లుగా చెప్పబడింది.

12. రంగనాధ రామాయణము – గోన బుధ్ధారెడ్డి (క్రీ.శ.1200-1250). దీనిని రంగనాధుడను కవి రచించినట్లుగా కూడా చెబుతారు.

13. భాస్కర రామాయణము – అనేక కవికృతము. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడైన మల్లికార్జున భట్టు, శిష్యుడైన కుమార రుద్రదేవుడు, మిత్రుడైన అయ్యనార్యుడు దీనికి కర్తలు.

14. ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వ శేషం – ఎఱ్ఱా ప్రెగ్గడ (క్రీ.శ.14 శతాబ్ది పూర్వార్ధం). రెడ్డిరాజుల ఆస్థానంలో ఉండినవాడు.  హరి వంశం. ఎఱ్ఱన రామాయణమును కూడా రచించి ప్రభువగు ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇప్పుడు లభ్యమగుట లేదు.  లక్ష్మీ నృసింహ పురాణం స్వతంత్ర కావ్యం. తెలుగులో తొలి ప్రబంధం అని చెబుతారు.

15. విక్రమ సేనము – చిమ్మపూడి అమరేశ్వరుడు. ఎఱ్ఱన కాలం వాడే. పలువురు ఆంధ్ర కవులీతనిని మహాకవిగా స్తుతించారు. ఈ కావ్యం ఇప్పుడు లభించడం లేదు.

16. కావ్యాలంకార చూడామణి – విన్నకోట పెద్దన. ఈ కాలంవాడే.

17. కేయూర బాహు చరిత్రం – మంచన (క్రీ.శ.1350 ప్రాంతం). ఇది సంస్కృతంలోని విద్దసాలభంజికను అనుసరంచి వ్రాసిన కావ్యం.

18. ఉత్తర హరివంశం – నాచన సోముడు (క్రీ.శ.1390 ప్రాంతం).

19. రావిపాటి త్రిపురాంతకుడు (క్రీ.శ.14వ శతాబ్దం ఉత్తరార్ధం) – త్రిపురాంతక ఉదాహరణం, ఉదాహరణ వాఙ్మయంలో చాలా గొప్పదిగా చెబుతారు. ఈయన సంస్కృతంలో వ్రాసిన ప్రేమాభిరామాన్ని అనుసరించి క్రీడాభిరామాన్ని వినుకొండ వల్లభరాయుడు వ్రాశాడు. ప్రేమాభిరామం ఇప్పుడు అలభ్యం. ఈయనవే అంబికా శతకం, మదన విజయం, చంద్ర తారావళి కృతులు ఇప్పుడు అలభ్యం.

20. సింహగిరి వచనములు – కృష్ణమాచార్యులు. తెలుగులో తొలి వచన రచనగా దీనిని పేర్కొంటారు.


ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s