తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -3

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -3

21. శ్రీనాథుడు (క్రీ.శ.1360-1450) – తనకు పూర్వముండిన కవులలో ముఖ్యంగా వేములవాడ భీమకవి తెలుగు పద్యానికి సంతరించిపెట్టిన నడకను అందిపుచ్చుకుని తనదైన ప్రత్యేకమైన భాషతోనూ శైలితోనూ తెలుగు పద్యాన్ని అలంకరించి, వివిధాలైన విన్యాసాలతో తెలుగు పద్యాన్ని నడిపి చూపిన మహాకవి. ఈయన రచించిన మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్రము ఇప్పటికీ అలభ్యం. వీటిల్లో ముఖ్యంగా హాలుని గాథ సప్తశతికి తెలుగు అనువాదమైన శాలివాహన సప్తశతి లభించకపోవడం తెలుగువాళ్ళ దురదృష్టం. సంస్కృతంలో శ్రీహర్షుని నైషధాన్ని సంక్షిప్తీకరించి తెలుగులో శ్రీనాథుడు రచించిన శృంగారనైషధం ప్రౌఢ రచన, ప్రసిధ్ధ రచన. హరవిలాసము, భీమఖండము, కాశీఖండము, శివరాత్రి మాహత్మ్యం, పల్నాటి వీరచరిత్ర (ద్విపద) శ్రీనాథుని ఇతర రచనలు.

22. క్రీడాభిరామం – వినుకొండ వల్లభరాయుడు, శ్రీనాథుని కాలంవాడే. క్రీడాభిరామాన్ని శ్రీనాథుడే రచించి ఏకారణం చేతనో వల్లభరాయుని పేరుతో వెలువరించాడని పూజ్యులు స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి అభిప్రాయం. ఆమోద యోగ్యమైనదిగా తోచదు. కాకతీయుల కాలంలో చలికాలంలోని ఒక రోజుని, తెల్లవారింది మొదలు సాయంకాలమై సూర్యుడు అస్తమించేదాకా, వర్ణించి చూపిన రచన ఇది. అయితే ఇందులో అత్యదిక భాగం అసభ్య వర్ణనలతోనూ, పదజాలంతోనూ నిండి ఉండడం వలన నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది ఈ రచన. అయితే, తెలుగులో పద్య కావ్యాలలో, రచన చేస్తున్న నాటి సాంఘిక పరిస్థితులను ఇంతగా స్పష్టంగా చూపించి చేసిన రచన మరొకటి లేదు. అబూత కల్పనో, ఆనాటిదాకా ఆనవాయితీగా వస్తూండిన సంస్కృతంలోని ఏదో కావ్యానికి అనువాదమో కాకుండా, తెలుగులో స్వతంత్రంగా వెలువడిన ఒకే ఒక్క పద్య కావ్యం.

23. బమ్మెర పోతరాజు (క్రీ.శ.1400-1450) – శ్రీనాథునికి సమకాలీకుడు, బంధువు. భోగినీ దండకం, వీరభద్ర విజయం, శ్రీ మదాంధ్ర భాగవతం ఈతని రచనలు.  నారాయణ శతకాన్ని కూడా పోతన రచించాడని కొందరు చెబుతారు.  శ్రీ మదాంధ్ర భాగవతం సంస్కృతంలో వ్యాసభగవానుని భాగవత పురాణానికి ఆంధ్రీకరణం. లుప్తమైపోవుటచేత, ఇందులో పంచమ స్కంధాన్ని గంగన, షష్ట స్కంధాన్ని ఏర్చూరి సింగన, ఏకాదశ స్కంధాన్ని వెలిగందల నారయ రచించినట్లుగా చెబుతారు.

24. విక్రమార్క విజయము – జక్కన. పోతన కాలంవాడే.

25. అనంతామాత్యుడు – రసాభరణము (క్రీ.శ.1424లో ముగించినట్లు తెలుస్తుంది), అనంతుని ఛందస్సు, భోజరాజీయం ఇతని రచనలు.  సత్య ప్రభావాన్ని నిరూపించే సుప్రసిధ్ధమైన గోవ్యాఘ్ర సంవాదం భోజరాజీయం లోనిదే.

26. హరిశ్చంద్రోపాఖ్యానం – గౌరన (క్రీ.శ.15వ శతాబ్దం). నవనాధ చరిత్రం (ద్విపద).  హాస్యరస పోషణలో ఇతనిది అందె వేసిన చేయి అని చెబుతారు.

27. సకలనీతి సమ్మతము – మడికి సింగన.  

28, నచికేతోపాఖ్యానం – కఠోపనిషత్తు లోనిది.  దగ్గుపల్లి దుగ్గయ, శ్రీనాథుని బావమరిది.

29. సింహాసనా ద్వాత్రింశిక – కొఱవి గోపరాజు (క్రీ.శ.15వ శతాబ్దం పూర్వార్ధం). తెలుగులో సమకాలీన సాంఘిక చరిత్రను కొంతలో కొంతైనా గ్రంథస్తం చేసిన అతి కొద్ది రచనలలో ఇది ఒకటి. క్రీ.శ.15వ శతాబ్దం నాటి సాంఘిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ రచన చాలా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు.

30. పంచ తంత్రం – దూబగుంట నారాయణ కవి (క్రీ.శ.1470 ప్రాంతం).

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s