తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -4

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -4

31. శృంగార శాకుంతలం – పిల్లలమఱ్ఱి పినవీరన (క్రీ.శ.1490 ప్రాంతం). ఈయనదే జైమిని భారతం, సంస్కృతంలో వ్యాసభగవానుని శిష్యులలో ఒకడైన జైమిని రచించిన భారతాశ్వమేధ కథకు తెలుగు అనువాదం.

32. నంది మల్లయ, ఘంట సింగయ (క్రీ.శ.15వ శతాబ్దం ఉత్తరార్ధం) – తెలుగులో తొలి జంట కవులు. వరాహ పురాణం. ప్రభోద చంద్రోదయం (సంస్కృతంలో కృష్ణమిశ్రుని వేదాంతబోధక నాటకానికి తెలుగు ప్రబంధ రూపం). ఘంట సింగయకు మలయమారుతకవి అని పేరుండేది. నంది తిమ్మన ఇతనికి మేనల్లుడు.

33. విష్ణుపురాణం – వెన్నెలకంటి సూరన (క్రీ.శ.16వ శతాబ్దం పూర్వార్ధం).

34. శ్రీకృష్ణదేవరాయలు  (క్రీ.శ.1509-1530 రాజ్య కాలం). సుప్రసిధ్ధుడు, రాజకవి. మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనము, సకల కథా సార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి, ఇవన్నీ సంస్కృతంలో, అయితే ఇప్పటికీ అలభ్యం.  ఆముక్త మాల్యద తెలుగులో, ప్రౌఢ రచన. పంచ ప్రబంధాలలో ఒకటిగా లోక ప్రసిధ్ధం.

35. మనుచరిత్ర – అల్లసాని పెద్దన (క్రీ.శ.1475 – 1534). ప్రబంధ వాఙ్మయంలో తొలి ప్రబంధం. కృష్ణదేవరాయలచే ఆంధ్రకవితా పితామహ బిరుదం పొందిన వాడు. పద్యరచనలో ఈయన ఎక్కువగా అవలబించిన పధ్ధతి ‘ద్రాక్షా పాకం’ అంటే సాధ్యమైనంతవరకూ సరళమైన పదాలతో నిండి ఉండి మొదటిసారి చదవడంతోనే అర్ధం అవగతం కావాలన్నట్లుగా చేసే రచనా పధ్ధతి. (‘పెద్దన వలె కృతి చెప్పిన పెద్దనవలె’ అని కవి చౌడప్ప). ఈయనది మరో రచన హరికథాసారం అలభ్యం.

36. పారిజాతపహరణం – నంది తిమ్మన. రాయల దేవేరులలో ఒకరైన తిరుమలదేవితో ఈతడు అరణంగా వచ్చాడని చెబుతారు.

37. రాజశేఖర చరిత్రం – మాదయగారి మల్లన.

38. రామాభ్యుదయం – అయ్యలరాజు రామభద్రకవి.

39. కళాపూర్ణోదయం – పింగళి సూరన (క్రీ.శ.16వ శతాబ్దం ఉత్తరార్ధం). ప్రభావతీ ప్రద్యుమ్నం, రాఘవపాండవీయం (ద్వ్యర్ధి కావ్యం). గరుడపురాణం (లుప్తమైంది).

40. వసుచరిత్ర – భట్టుమూర్తి. కృష్ణదేవరాయల అల్లుడైన అళియరామరాయల ఆస్థానంలో ఉండడంవలన ఈయనకు రామరాజభూషణుడు అనే బిరుదు వచ్చిందనీ, ఇతని అసలుపేరు మూర్తి అనీ, భట్టు కులము వారగుటచేత భట్టుమూర్తి అనే పేరు కలిగి యుండెననీ చెబుతారు.  గొప్ప పండితుడు. అవధానములోనూ, ఆశుకవిత్వంలోనూ ఆరితేరినవాడు.  సంగీతకళారహస్యనిధి.  నరసభూపాలీయం అనే నామాంతరంగల కావ్యాలంకార సంగ్రహం అనే గ్రంథం, హరిశ్చంద్రనలోపాఖ్యానం (ద్వ్యర్ధి కావ్యం) ఈతని ఇతర రచనలు. వసుచరిత్ర సంస్కృతంలోకి కూడా అనువదించబడింది. ఆంధ్ర ప్రబంధ వాఙ్మయ తారాహారానికి ఈయన నాయకమణి అని చెబుతారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s