తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -5

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -5

41. పాండురంగ మాహత్మ్యం – తెనాలి రామకృష్ణకవి. వికటకవి గా సుప్రసిధ్ధుడు. రాయ ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకడుగా నమ్ముతారు గాని చారిత్రకంగా ఇది నిరూపణకు సాధ్యమయ్యే విషయం కాదని కూడా అభిప్రాయం ఉంది.

42. కవి కర్ణ రసాయనము – సుంకుసాల నృసింహకవి.  ఇతడు భట్ట పరాశరుని శిష్యుడు (క్రీ.శ.1536 ప్రాంతం).

43. వెలగపూడి వెంగయామాత్యుడు (క్రీ.శ.1530 ప్రాంతం). బిళ్వమంగళుడను నామాంతరంగల లీలాశుకుడను కవి సంస్కృతంలో రచించిన శ్రీ కృష్ణకర్ణామృతంలోని 300 శ్లోకాలను మూలంలోని భావం చెడకుండా అంతే సుందరంగా తెలుగులో రచించాడని చెబుతారు.

44. కాసె సర్వప్ప – సిధ్ధేశ్వర చరిత్రం (క్రీ.శ.15 శతాబ్దం ఉత్తరార్ధం).

45. యయాతి చరిత్రం – పొన్నకంటి తెలగన్న (క్రీ.శ.16 శతాబ్దం ఉత్తరార్ధం). తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యంగా చెబుతారు.

46. కందుకూరి రుద్రకవి (క్రీ.శ.16వ శతాబ్దం ఉత్తరార్ధం అనీ, క్రీ.శ.17వ శతాబ్దం పూర్వార్ధం అనీ అభిప్రాయ బేధాలున్నాయి). నిరంకుశోపాఖ్యానం. సుగ్రీవ విజయం (యక్ష గానం. తెలుగులో యక్షగానాలలో మొదటిదని చెబుతారు). జనార్ధనాష్టకం.

47. సారంగు తమ్మయ – వైజయంతీ విలాసం.

48. రఘునాధ నాయకుడు (క్రీ.శ.1614 -1633). తంజావూరు నాయకరాజులలో గొప్పవాడు. సుమారు వంద గ్రంథాలను రచించాడని చెబుతారు. వీటిల్లో రఘునాధ రామాయణం, వాల్మీకి చరిత్రం అనే రెండు రచనలే నేడు లభిస్తున్నై.

49. చేమకూరి వెంకట కవి – విజయ విలాసము. రఘునాధ నాయకుని ఆస్థానంలో ఉండినవాడు. ఈతని మొదటి రచన సారంగధర చరిత్ర. భట్టు మూర్తి తో సరితూగగల కవి. వెంకట కవి తెలుగు పదముల విరుపులో భట్టు మూర్తి కన్న మిన్న అనిపించుకున్నాడని చెబుతారు.

50. కువలయాశ్వ చరిత్రము – చిన నారాయణ రాజు (క్రీ.శ.1600-1660). పింగళి సూరన కళాపూర్ణోదయం తరువాత అంతటి కథా రమణీయత కలిగిన ప్రబంధం తెలుగులో ఇదే నని చెబుతారు.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s