తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -6

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -6

51. గణపవరపు వేంకట కవి (క్రీ.శ.17వ శతాబ్దం మధుర నాయకరాజుల కాలం). ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము. ఈతడు వ్రాసిన వాటిల్లో లక్షణ గ్రంథములెక్కువని చెబుతారు.

52. విజయరంగ చొక్కనాధుడు (క్రీ.శ.1706-1732). కవిపండిత పోషణమొనర్చుటేగాక తాను స్వయంగా మాఘ మహత్మ్యము, శ్రీ రంగ మహత్మ్యము అను వచన గ్రంథములను రచించాడు. ఇవి వాడుక భాషలో వ్రాయబడినవి. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవి సుముఖము వేంకట కృష్ణ నాయకుడు.

53. సుముఖం వేంకట కృష్ణ నాయకుడు – అహల్యా సంక్రందనం, రాధికా స్వాంతనం అనే కావ్యాలు.  జైమిని భారతం వచన రచన. రాధికా స్వాంతనం ఏకాశ్వాస ప్రబంధం.  ఇందులోని ఎన్నో పద్యాలు ముద్దుపళని రాధికా స్వాంతనంలో కూడా ఉన్నాయని చెబుతారు.

54. శేషము వేంకట కవి – తారా శశాంకం విజయరంగ చొక్క భూపతి మంత్రి అయిన వంగల శీనయ్యకు అంకితమీయబడినది. దక్షిణాంధ్ర కవులలో చేమకూర వేంకటకవి తరువాత ఎన్నదగిన వాడని చెబుతారు.

55. వెలగపూడి కృష్ణయ్య – మాలతీ మాధవం, గౌళికా శాస్త్రం ఈ రెండూ ఇప్పటికీ అలభ్యం. భానుమద్విజయం. సి.పి.బ్రౌను దొర ఈ కావ్యాన్ని ఎంతగానో ప్రశంసించాడని చెబుతారు.

56. కుందుర్తి వేంకటా చలపతి – మిత్రవిందా పరిణయము.

57. పాలవేకరి కదిరీపతి (క్రీ.శ.1660 ప్రాంతం). విజయనగరాజ్యం అంతరించిన పిమ్మట స్వతంత్రములైన సామంత రాజ్యములలో మైసూరు రాజ్యం ఒకటి.  ఇక్కడ కొందరు కవులు తెలుగులో పద్య, గద్య కావ్యాలను రచించారు. వారిలో కదిరీపతి ముఖ్యుడు. ఈతని పూర్వులు కోలారు ప్రాంతపు సామంత రాజులని చెబుతారు. కదిరీపతి రచన శుకసప్తతి ప్రసిధ్ధమైనది.

58. కూచిమంచి తిమ్మకవి (క్రీ.శ.1700-1750) – బహు గ్రంథ కర్త. కవి సార్వభౌముడనే బిరుదుండేదని చెబుతారు. రుక్మిణీ పరిణయం, రాజశేఖర విలాసం, నీలా సుందరీ పరిణయం, అచ్చ తెలుగు రామాయణం, రసిక జన మనోరంజనం, సాగర సంగ మాహత్మ్యం, శివ లీలా విలాసం, సర్వ లక్షణ సార సంగ్రహం, సారంగధర చరిత్రం, కుక్కుటేశ్వర శతకం (పిఠాపురంలో వెలసి ఉన్న కుక్కుటేశ్వ స్వామి నుద్దేశ్యించి చెప్పినది) ముఖ్యమైనవి.

59. కూచిమంచి జగ్గకవి (ఖ్రీ.శ.1700-1760) తిమ్మకవి తమ్ముడు. జానకీ పరిణయం, ద్విపద రాధకృష్ణ చరిత్రం, సుభద్రా పరిణయం, చంద్రరేఖా విలాసం, సోమదేవ రాజీయం ఈతని రచనలు.

60. ఏనుగు లక్ష్మణ కవి (క్రీ.శ.1725-1780) తిమ్మకవి సమకాలీకులలో తరువాతి వాడు. బహు గ్రంథ కర్త. రామేశ్వర మాహత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, విశ్వేశ్వరోదాహరణం, కాళికా దండకం, ఆదిత్య హృదయం మొదలగునవి ఇతని రచనలు. అయితే వీటన్నిటి కంటే, సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతికి ఈతడు చేసిన ఆంధ్రీకరణం సుభాషిత రత్నావళి వలననే ఎక్కువ పేరు వచ్చింది.

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s