తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -7

తెలుగు పద్య సాహిత్య ప్రస్థానం (స్థూలంగా) -7

61. ఏలకూచి బాలసరస్వతి (క్రీ.శ.1730-1790). భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించినవారిలో ఇతనొకడు. మల్లభూపాలీయం అనే పేర ప్రచారం పొందిన గ్రంథం.

(భర్తృహరి సుభాషిత త్రిశతి తెలుగులోకి మొత్తం ఎనమండుగురిచే అనువదించ బడింది. ఏలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి, పోచిరాజు వీరన, పడకిండ్ల గురురాజు, వెల్లాల నరసింగయ్య, కొక్కొండ వెంకట రత్నం, గుర్రం వెంకట సుబ్రహ్మణ్యం ఆ ఎనిమిది మంది కవులు).

62. ఆడిదం సూరకవి (క్రీ.శ.1730-1760 ప్రాంతం) పూసపాటి విజయరామరజు గారి కాలంలో ఉన్నవాడు. కవిజన రంజనం, రామలింగేశ్వర శతకం, ఆంధ్ర నామ శేషం ఈతని రచనలు.

63. కనుపర్తి అబ్బయామాత్యుడు (క్రీ.శ.1780 ప్రాంతం) – అనిరుధ్ధ చరిత్రం, కవిరాజమనోరంజనం. భట్టుమూర్తి వసుచరిత్రం తరువాత ఈ కవిరాజమనోరంజనంతో సరితూగగల ప్రబంధములు ఒకటి రెండు కంటే లేవని వీరేశలింగంగారి అభిప్రాయం.

64. కంకటి పాపరాజు (క్రీ.శ.1750-1800)- తిక్కన నిర్వచనోత్తర రామాయణమును చంపూ ప్రబంధంగా మలిచిన వాడు.

65. దిట్టకవి నారాయణ కవి (క్రీ.శ.1790 ప్రాంతం). – రంగరాయ చరిత్రం. క్రీ.శ.1757లో ఫ్రెంచి సేనలకు పూసపాటి విజయరామరాజుగారి సేనలకు బొబ్బిలి వద్ద జరిగిన యుధ్ధం ఇందులో వర్ణితం.

66. వేమన (క్రీ.శ.18వ శతాబ్దం పూర్వార్ధం). వేమన శతకం సుప్రసిధ్ధం.

67. గోపీనాధము వేంకటకవి – వెంకటగిరి సంస్థానంలో ఆస్థానకవి. గోపీనాధ రామాయణము.

(అయిపోయింది).

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s