తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (3)

అందలము – అందలానికి ఎత్తేశాడు అంటే పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు అన్న అర్ధంలో ఇప్పుడు వాడకంలో ఉన్నట్లుగా కనపడుతుంది గాని, అందలము అన్న మాటకు  ‘పక్కలన తెరలు లేని పల్లకీ’ అని అర్ధం. పూర్వం రాజులకాలంలో రాజాస్థానానికి తీసుకుని వెళ్ళేప్పుడు సన్మానితులను అందరికీ కనిపించే విధంగా అందలం ఎక్కించి తీసుకుని వెళ్ళేవాళ్ళు. రాజులకాలం పోయి, అందలాలు మాయమయ్యాక, పొగడ్తలలో ముంచెయ్యడం అన్న మాటకు అర్ధంగా అందలమన్న మాట మిగిలింది.

లొట్ట వేసుకుంటూ, లొట్టలు వేసుకుంటూ అంటే చాలా ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఇప్పుడు వాడ బడుతోంది. అయితే, ఈ లొట్ట వేసుకుంటూ అన్న మాటకు అర్ధం నిజానికి ‘లోటాడు వేసుకుంటూ’ అని. పూర్వకవుల ప్రయోగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ‘కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి’ (వేణుగోపాల శతకం) ఇత్యాదిగా. లొట్టి అన్న పదానికి చెట్టునుండి కల్లును తేసే కుండ అని అర్ధం. లొట్టెడు తాగడం అంటే కల్లు ముంతడు తాగడం అనేగా అర్ధం. అయితే, కాలక్రమేణా జనసామాన్యం సమ్మతికి తగినట్లుగా అర్ధాన్ని మార్చుకుని ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఈ మాట కుదురుకుంది.

ఇప్పుడెవరూ ఇలా అడగడానికి ధైర్యం చెయ్యరుగాని, ఒకప్పుడు మీరే కులస్తులు? అని అడగడానికి గ్రామీణులలో ‘మీరేముట్లు?’ అని అడగడం వాడకంలో ఉందేది. ఇందులో మూడు మాటలున్నాయి. మీరు, ఏమి, ఉట్లు లేదా ఉట్టులు, అనేవి ఆ మూడు మాటలు. వీటిల్లో ‘ఉట్టు’ అన్న పదానికి ‘పుట్టు’ అనీ, ఇంకా ‘కారు, స్రవించు’ అనీ అర్ధాలున్నాయి. ఏ కులంలో జన్మించారు లేదా పుట్టారు అని ప్రశ్నించడానికి సంక్షిప్తంగా తయారయిన రూపమే ‘ఏముట్లు’ అన్న మాట. అయితే, ఇప్పటికే ఈ మాట మరుగున పడిపోయింది.

ప్రకటనలు

4 thoughts on “తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (3)

  1. “అందలం”, “లొట్టలు వేసుకుంటూ”, “మీరేముట్టు” అన్న తెలుగు పదాలకు మీరిచ్చిన అర్థ వివరణలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s