తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (3)

“ఏల?” అని ప్రశ్నిస్తున్నట్లుగానే కనబడుతూ, శుధ్ధ దండుగ అన్న భావాన్ని ధ్వనిస్తూ సాగే పద్యాలు అధిక్షేప శతక కవులు చాలా ఇష్టంగా చెప్పా రనిపిస్తుంది. భక్తమందార, వేణుగోపాల, మదనగోపాల శతకాలలోనుండి ఈ క్రింది పద్యాలను పరికిస్తే, ఆలోచనా బుధ్ధిని ఎంతగా కష్ట పెట్టి, ఎంతెంత దూరాలకు లాక్కువెళ్ళి, చిత్రవిచిత్రాలయిన ఎన్నెన్ని రకాల ‘ఏల’ లను సృష్టించారో అర్ధమవుతుంది. పద్యం పూర్తవడానికి తప్పని
స్థితిలో కొన్ని రకాల ‘ఏల?’ లు రూపాంతరం చెందడమూ, పునరావృత్తమవడమూ గమనించవచ్చు.

భక్తమందార శతకం నుండి:

“పద్యంబేల పిసిండికి?
ఈప్సితము దీర్పన్ లేని జేజేకు నైవేద్యంబేల?
పదార్థ చోరునకు నుర్విన్ వేదవేదాంత సద్విద్యాభ్యాస బుధ్ధి ఏల?
(మది భావింపగ) ఎల్లపుడున్ మద్యంబానెడు వానికేల సుధ?”

“ముకురంబేల గుడ్డివానికి?
జనామోదానుసంధాన రూపకళాకౌశలకామినీ సురతలిప్సాబుధ్ధి (ధాత్రిన్) నపుంసకతం గుందెడు వానికేమిటికి?
మీసంబేటికిన్ లోభికిన్?
మకుటంబేటికి మర్కటంబునకు?”

వేణుగోపాల శతకం నుండి:

“పతికి మోహములేని సతి జవ్వనం బేల
పరిమళింపని సుమ ప్రచయ మేల
పండిత కవివర్యులుండని సభ ఏల
శశి లేని నక్షత్ర సమితి ఏల
పుత్త్ర సంపద లేని పురుషుని కలి మేల
కలహంసములు లేని కొలన దేల
శుకపికరవ మొకించుక లేని వన మేల
రాజు పాలింపని రాజ్య మేల
రవి వికసనంబు లేనట్టి దివసమేల
ధైర్య మొదవని వస్తాదు తనమదేల”

మదనగోపాల శతకం నుండి:

“ముసిడి తుప్పలకు గొప్పులు దువ్వనేటికి
వట్టి నూతికి యొరల్ గట్ట నేల
గొడ్డుబోతుకు నొఱ్ఱ కొట్టు కాయం బేల
మాచకమ్మకు పైట మా టదేల
అంధురాలికి నిల్వుటద్ద మేటికి
నపుంశకున కొయ్యారంపు జాన యేల
క్షుద్రగుణునకు సజ్జన గోష్టి యేల
మోటు కొయ్యకు మృదువైన మాట లేల”

“దురితాత్మునకు దేవ గురుపూజనం బేల
కర్ణ హీనునకు జౌకటు లవేల
జ్వరరోగ కృశునకు హరి చందనం బేల
పరమ లోభికి దాన పటిమ యేల
కర్మ బాహ్యునకు గంగా స్నానమేటికి
కామాంధునకు తపః కాంక్ష ఏల
తిండిపోతుకు నిత్య దేవతార్చన లేల
వెట్టివానికి సద్వివేక మేల
మూర్ఖ జనునకు సతత ప్రమోద కరణ
            సాధు సజ్జన గోష్టి ప్రసంగ మేల”

“మొండి కట్టెకు ధర్మములు దెల్పగా నేల
సొట్ట వానికి నాట్య శోభ లేల
అంధురాలికి నయనాంత సంజ్ఞ లవేల
బోసిదానికి దాంబూల మేల
మూర్ఖ జనుజకు బహుతరామోదకారి
         సరసకవితావిచిత్ర వైఖరు లేల”

“తండ్రి దూషించి పెద్దల నుతింపగనేల
తమ్ముల జెరిపి సధ్ధర్మ మేల
తల్లిని దన్ని బాంధవ పూజనం బేల
మిత్రుని విడిచి పై మేళ్ళవేల
గురుని నిందించి భూసురుల వేడగ నేల
బిడ్డ నమ్మి యొకండ్ర బెంచ నేల
యాశ్రితు నటు దోలి యర్థి రక్షణ మేల
పెనిమిటి దిట్టి దైవ నుతి యేల”

“ఊళ్ళు దోచుక రాతిగుళ్ళు గట్టగనేల
యిళ్ళు బుచ్చుక తోట లేయనేల
ప్రజల బీడించి ధర్మము సేయగా నేల
దార్లు గొట్టి సువర్ణదాన మేల
మాన్యముల్ కబళించి సుఖము సేయగ నేల
సాధుల జెరిపి పై శాంతు లేల
బుధుల సొమ్ము హరించి భూరి యివ్వగనేల
పురములు గూల్చి గోపురము లేల”

“బురదగోతుల లోన బొరలాడు దుంతకు
          సారచందన గంధ చర్చయేల
పరగళ్ళ వెంబడి తిరుగు గాడిదకి   
         విశాల మందిర నివాసంబు లేల
బయలు పుల్లెలు నాకి బ్రతికెడు కుక్కకు
         సరసాన్న భక్ష్య భక్షణము లేల
యడవుల చెట్టెక్కి యాడు కోతికి
         రత్న సౌధాగ్రసీమ సంచార మేల
మూర్ఖ జనులకు సతత ప్రమోదకరణ
         సాధు సజ్జన గోష్టి ప్రసంగ మేల”

ఈ ‘ఏల?’ నే ‘ఏమి?’ గా చేసి చెప్పిన పద్యాలు కూడ మదనగోపాల శతకంలో ఉన్నాయి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s