తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (6)

మనిషి ధనార్జలోనే తన దృష్టినంతా ఉంచి జీవితాన్ని గడుపుతాడే తప్ప దైవచింతన అసలుకే చెయ్యడన్న భావం, ఒకడు లోభియై కూడబెట్టిన ధనమంతా చివరికి వేరే ఎవరికో చెందిపోతుందే తప్ప వేరే కాదన్న భావం, ఖలుని దృష్టి ఎప్పుడూ స్త్రీ శరీరాంగాల మీదే ఎప్పుడూ నిలిచి ఉంటుంది తప్ప వేరే కాదన్న భావం, మనుజుడు ఐశ్వర్య సంపదే నిత్యమూ, సత్యమూ అని నమ్మి పొందే ఆనందం ఎంత తుఛ్ఛమైనదో కదా! అన్న భావము, ఇత్యాది stock భావాలు లేని శతకం లేదంటే అతిశయోక్తి కాదేమో! వీటిపై పదే పదే పద్యాలలో చెప్పడంలో ఏమాత్రమూ విసుగుచెందలేదేమో శతక కవులు అనిపిస్తుంది. దాదాపు సుమతీ శతకకారుని కాలంనుంచీ మనిషికి దైవచింతన నానాటికీ తగ్గిపోతొందనీ, కేవల ధనార్జన మీదే అతని దృష్టి కేంద్రీకృతమై ఉందని, తన్మూలంగా లోకంలో పాపం పెరిగి ప్రపంచం నాశనమైపోయేరోజు దగ్గరలోనే ఉందనే భావనలు కవులకు ఉండినాయి. శతాబ్దాలుగా శతకాలలోనే అని కాకుండా ఇతరత్రా వీలు దొరికినప్పుడల్లా ఇలాంటి భావనలే వ్యక్తమువుతూండినా, ఒక వైపునుంచి మనిషి తన బ్రతుకు తాను సాధ్యమైనంతా నీతిగా బతుకుతూనే ఉన్నాడు, తనకు తోచినప్పుడు దైవచింతన చేస్తూనే ఉన్నాడు, తను సంపాదించిన దానిలోంచి తోచినది ధర్మం చేస్తూనే ఉన్నాడు. లోకం సాధ్యమైనంత సజావుగా సాగిపోతూనే ఉంది.

పద్యం ఛందోబధ్ధంగానూ, ఒకింత ధారతోనూ చెప్పగలిగిన సామర్ధ్యం సంపాయించుకున్నతరువాత, వేరే కొత్తగా చెప్పగలిగిందేమీ లేనప్పుడు పద్యకవులు శతకాలను చెప్పారు అనిపిస్తుంది. శతకాలను చెప్పడంలో ఉన్న సౌలభ్యం కృతి చెప్పడంలో లేదన్నది సత్యం. శతకనిర్మాణానికి కొత్తగా చేయాల్సింది పెద్దగా ఏమీ లేదు, పద్యాలు అప్పటికే ఉన్నవే. స్వప్నంలో స్వామి సాక్షాత్కారాన్ని వివరించే 5 నుంచి 10 ఎత్తుబడి పద్యాలతో మొదలయ్యే శతకం ఏదైనా, ఆతరువాత కొన్ని ‘వచ్చు’ పద్యాలు, ‘వలదు/రాదు’ పద్యాలు, ‘రొచ్చు/రోత’ పద్యాలు, ‘అగునా/అవునా’ పద్యాలు,  ఇలా సాగుతూ ముగుస్తుంది. ఇందులో కొత్త ఏమీ లేదు అని వాళ్ళకు తెలుస్తున్నా చెప్పారు. ఎవరూ చెప్పకుండానే మనిషి సహజంగానే సాధ్యమైనంత నీతిమంతంగా బతుకుదామనే అనుకుంటాడు కాబట్టీ, ఈ దేశంలో మనిషి నీతిగా బతకడానికి కావలసిన పరిస్థితులు మొదటినుంచీ ఉన్నాయి కాబట్టీ, నీతిని బొధిస్తున్నట్లుండే ఈ శతకాల వల్ల అదనంగా జరిగిందేమీ లేదని నేననుకుంటాను.

ఏ concept కైనా, రచనకైనా, సాహిత్య గౌరవం న్యాయంగా ఒక్క సారే దక్కాలి, దక్కుతుంది. రామాయణానికి సాహిత్య గౌరవం వాల్మీకి దగ్గరే దక్కుతుంది. చైతన్య స్రవంతి రచనకు సాహిత్య గౌరవం James Joyce దగ్గరే దక్కుతుంది. భావకవిత్వానికి సాహిత్య గౌరవం Keats, Shelly, Wordsworth ల రచనల దగ్గరే దక్కుతుంది. Existentialism కు సాహిత్య గౌరవం Sartre, Camus ల రచనల దగ్గరా, Magic Realism కు సాహిత్య గౌరవం Marquez రచనల దగ్గరా దక్కుతుంది. అందువల్ల, రామాయణాన్ని నిర్వచనంగానూ, నిరోష్ట్యంగా, అచ్చతెనుగులోనూ, ఇలాగే ఇంకా ఎన్నోరకాలుగా చెప్పిన ప్రతిసారి ఆయా రచనలకు సాహిత్య గౌరవం దక్కాలన్న మాట న్యాయమైనది కాదు. అలాగే తెలుగులో నీతి శతకం అన్న ప్రక్రియకు సాహిత్య గౌరవం ‘సుమతీ శతకం’ దగ్గరే దక్కుతుంది.

(అయిపోయింది).

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s