వివిధాలు (5)

– వివాహంలో పెండ్లికూతురి సోదరుడు పెండ్లికొడుకుకు వరిధాన్యం (శాలి ధాన్యం), పేలాలూ అందివ్వడం (అనే ఆచారం పూర్వం ఉండడం) వల్లనే “శ్యాలః” (ఇప్పటి రూపం ‘సాల’) (బావ) అనే మాట పుట్టిందని పెద్దల వివరణ.

– తెలుగు పూర్వ కవులలో నన్నయ పురోహితుడు, మల్లన కోశాధికారి, నన్నె చోడుడు దండనాధుడు, భీమన  దేశాంగ మంత్రి, ప్రతాపరుద్రుడు మహారాజు, భాస్కరుడు అమాత్యుడు, భద్ర భూపతి (బద్దెన) నర్మ సచివుడు.

– సంస్కృతమునకు అనుష్టుప్పు ఎలాగో, తెలుగునకు ద్విపద అలాంటిది- ఆది, ఆధారము అని చెబుతారు. ద్విపదలో ఉన్న ఒక విశేషం ఏమిటంటే, ద్విపద పాటగా పాడుకోవటానికి కూడా అనుకూలమైనది.

– పురాణ, విపుల కావ్య, కావ్య ప్రబంధ, ద్విపద, శతక, గద్య కవిత, వీర గీత, నాటక, గేయములని కవిత్వములు నవ విధములని పెద్దలు చెప్పిన మాట.

– జంబూనదము అంటే బంగారము.  “జంబూ ఫలరసోత్పన్న నదీ భవత్యా జంబూనదం” అని. అంటే నేరేడు పండ్ల రసము చేత పాఱిన నది యందు పుట్టినది అని అర్ధం.

– కృష్ణద్వైపాయనుడు – నల్లని ద్వీపము నందు పుట్టిన వాడు, వ్యాసుడు.  సత్యవతీ, పరాశరుల సమాగమము వలన ఒక నల్లని ద్వీపమున వ్యాసుడు పుట్టాడని ఆ పేరు.

– “అగ్ని గర్భం శమీ మివ” – శమీ గర్భమున అగ్ని ఉండుననుట లోక ప్రసిధ్ధము.

– ఏక, దశ, శత, సహస్ర, దశ సహస్ర స్థానముల పైవి లక్ష, దశ లక్ష, కోతి స్థానములు.  ఆ పైవి దశ కోటి, శత కోతి స్థానములు.  ఆ తరువాత వరుసగా, అర్భుదము, న్యర్భుదము, ఖర్వము, మహా ఖర్వము, పద్మము, మహా పద్మము, క్షోణి, మహా క్షోణి, శంఖము, మహా శంఖము, క్షితి, మహా క్షితి, క్షోభము, మహా క్షోభము, నిధి, మహా నిధి, పర్వతము, పరార్ధము, అనంతము, సాగరము, అవ్యయము, అచింత్యము, అమేయము, భూరి, మహా భూరి అని మొత్తం 35 స్థాన సంజ్ఞలు మన కున్నాయి.

– ప్రకృతిని చూడవలసిన విధానాన్ని చెప్పువారు కవులు. ఈ కవులలో ఉత్తములు ఋగ్వేద సంహిత నిచ్చారని పెద్దల మాట.

– రాజు ఋషి వంటి వాడు కావలననే భావము కాళిదాసునకు మిక్కిలి ప్రియమైనది అనీ, ఆయన నాటకాలలో సందర్భోచితంగా ఈ భావాన్ని చెప్పాడనీ పెద్దల మాట.

– మధురా నగరంలోని ఒక సరస్సులో “శంఖ పీఠం” అని ఉందేదట.  కవిత్వం బరువులు హరువులు చూడడానికి రచనలను దాని మీద ఉంచే వారట.  ఉత్తమమైన రచనలు తెలేవట!  కాకపోతే మునిగేవట!! దీనిలో నిజానిజాల మాట నలా ఉంచి, వెనక్కి తవ్వుకుంటూ పోతే, ఈ శంఖ పీఠంలో ‘శంఖం’, తమిళ ‘సంగం’ సాహిత్యకాలంలోని ‘సంగం’ దగ్గర తేలుతుంది. ఈ ‘సంగం’ పోనుపోనూ శంఖంగా రూపాంతరంచెందిందని పెద్దలు చెబుతారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s