ఛాయా చిత్రం (4)

హొయసలుల దేవాలయం (2)

ఆలయ నిర్మాణంలో హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. వారి శైలికి అలంకరణ పట్టుగొమ్మ లాంటిదని చెప్పవచ్చు. కాలి గోటితో సహా అత్యంత సూక్ష్మమైన వివరాలు కూడా రాతిపై మలచి చూపించిన నైపుణ్యం హొయసలుల కాలంనాటి శిల్పులది. శిల్పంకోసం వారు ఎంచుకున్న chloritic schist  (soft soap-stone) అనే రకపు రాయి హయసల శిల్పుల శిల్పకళా నైపుణ్య ప్రదర్శనకు ఎంతగానో సహాయ పడిందని చెబుతారు. కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ ప్రాంతంలో ఈ రాయి విరివిగా లభ్యం కావడం ఆలయ నిర్మాణంలో హొయసల శిల్పులు ఈ రకపు రాయిని వాడడానికి దోహదం చేసిన కారణాలలో ఒకటి. తవ్వి తీసినపుడు మెత్తగా ఉండి, భూమి ఉపరితల వాతావరణంలో కాలం గడిచే కొలదీ ఇనుములా గట్టిపడిపోయే లక్షణం ఈ రకపు రాతిది. ఈ లక్షణాన్ని అనువుగా మలచుకుని,  అనన్య సామాన్యమైన రీతిలో శిల్పాలను మలచి చూపించారు హొయసల శిల్పులు.

చిత్రం (7): బేలూరు చెన్నకేశవాలయంలోని ఒక స్తంభం పై అలంకరణ

చిత్రం (8): బేలూరు చెన్నకేశవ దేవాలయ గోడపై ఒక యుధ్ధ సన్నివేశ శిల్పం

చిత్రం (9): బేలూరు చెన్నకేశవ దేవాలయం గోడపై స్త్రీ అలంకరణ శిల్పాల వరుస

చిత్రం (10): నంది - హాలేబీడు హోయసలేశ్వరాలయం

చిత్రం (11): హాలేబీడు హోయసలేశ్వరాలయం గోడపై కుమారస్వామి, గణనాధ శిల్పాలు

చిత్రం (12): అంబ, భైరవి, దుర్గ - హాలేబీడు హోయసలేశ్వరాలయం

చిత్రం (13): సోమనాథపూర్ చెన్నకేశవాలయం

చిత్రం (14): సోమనాథపూర్ చెన్నకేశవాలయం గోడపై శిల్పాల వరుస

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                                                                                         

శిల్పాన్ని అలంకరించి చూపడంలో హొయసల శిల్పుల తరువాతనే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది వారి శిల్ప రచన. అందమైన అలంకరణతో నింపబడకుండానూ, మలచబడకుండానూ దేవాలయంలో ఎక్కడా ఒక్క అంగుళం మేర ప్రదేశం కూడా కనబడదు అన్నట్లుగా ఉంటుంది.  దేవాలయ ప్రాంగణమంతటా ఎటుచూసినా సరే సౌందర్యమే కనబడేలా చేసి సందర్శకులను దైవ దర్శనానికి ప్రసన్నమైన మనఃస్థితితోనూ, ప్రశాంత చిత్తంతోనూ పంపించడాన్ని వారు తద్వారా ఆశించారనుకోవడంలో తప్పులేదనుకుంటాను.

ప్రకటనలు

2 thoughts on “ఛాయా చిత్రం (4)

  1. బాగుందండీ చాలా చక్కని విషయాలను చెప్పారు! ఇప్పటి వరకు నేను చూసిన వాటన్నిటిలోనూ నాకు ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి విగ్రహం చాలా బాగా నచ్చింది. మీరు చెప్పినదానితో పోల్చి చూస్తే బహుశా అది కూడా వీళ్ళే చేసారేమో అని నా అనుమానం! అంత చక్కగా ఉంటుంది శిల్ప కళ! మీకేమయినా వివరాలు తెలిస్తే చెప్పగలరు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s