ఛాయా చిత్రం (10)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం

మన పూర్వీకులు మనకందించిన అత్యుత్తమమైన కళ, సంస్కృతి సంబంధమైన సంపదలలో లేపాక్షి శ్రీ వీరభద్రాలయం ఒకటి. ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో నిర్మించబడింది. విజయనగర రీతి ఆలయ నిర్మాణానికి, శిల్పకళకు ఒక ప్రతీకగా ఈ ఆలయాన్ని పెద్దలు చెబుతారు. ఈ ఆలయాన్ని కొన్ని నెలల క్రితం నేను మొదటిసారి సందర్శించినపుడు మళ్ళీ ఒక్కసారి కాదు, ఇంకొన్ని సార్లు ఈ ఆలయ సందర్శనకు రావలసి ఉంటుందని ఊహించుకునే ఉన్నాను.

లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం ముందు వైపు

లేపాక్షికి ఇప్పటి  నా ఈ సందర్శనం రెండవసారి. ఈ ఆలయాన్ని మొదటిసారి చూసినపుడు నన్ను బాగా ఆకర్షించిన అంశాలలో ఒకటి, ఈ ఆలయ నిర్మాణంలో స్థపతులు పాటించిన space management. ఈ ఆలయం అప్పటికే సహజంగా ఏర్పడి వుండిన తాబేలు ఆకారపు రాతి నిర్మాణం (కూర్మ శిల అని దీనిని పిలిచారు) పై నిర్మించబడింది. వెలుపలి ప్రాకరానికీ, లోపలి ప్రాకారానికి నాలుగు వైపులా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని స్తంభాల వసారా నిర్మాణానికి పోగా ఇంకా మిగిలిఉండిన ఖాళీ ప్రదేశాన్ని నాలుగు వైపులా ఇంచుమించు సమానంగా వదిలి మధ్యలో శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం మిరి కొన్ని ఉపాలయాల నిర్మాణం ఇక్కడ జరిగింది.

ముఖ్య ఆలయం చుట్టూ ఉన్న ఈ ఖాళీ ప్రదేశాన్ని స్తంభాల వసారాతోసహా సందర్శకుల సౌకర్యార్థం ఉద్దేశ్యించారన్నది అర్ధమవుతుంది. అయితే, ఇప్పుడు ఈ ప్రదేశమే రోజులో చాల భాగం నిశ్శబ్దమయమై ఒక విధమైన, మాటలతో వర్ణించి చెప్పలేని ఒక నీరవంలోకి తమను తాము అప్పగించుకుని దేని కోసమో ఎదురుచూస్తున్నట్లుగా కనబడుతూండడాన్ని చూస్తాం. అత్యద్భుతమైన, మహా సౌందర్యవంతమైన ఈ శిల్పమయ నిశ్శబ్ధాన్ని ఛాయాచిత్రాలలో బంధించడమే ముఖ్య ఉద్దేశ్యంగా నా ఈ రెండవ సందర్శనం జరిగింది. ఆ ఛాయా చిత్రాలే ఇవి:

లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం లోపల ఎడమవైపు స్తంభాల వసారా…

లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం ధ్వజ స్తంభం

లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం లోపల ఎడమవైపు

లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం లోపల స్తంభాల వసారా – మరో కోణం

ప్రకటనలు

2 thoughts on “ఛాయా చిత్రం (10)

    • లేపాక్షి శ్రీ వీరభద్రాలయం విజయనగర రాజుల కాలపు ప్రజల, కళాకారుల కళాభావనలకు, శిల్పకళకు ఒక మ్యూజియం లాంటిది. అచ్చంగా మనది అని చెప్పుకోగలిగిన మన ఆస్తి…cultural property! అన్ని పార్శ్వాలనూ తగిన రీతిలో explore చేసి, present చేయడం, నాకు చేతనయినంతలో, నేను చేస్తున్న పని.

      బ్లాగ్ సందర్శించి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s